ప్రతి వీకెండ్ కి సినిమాలు విడుదల కావడం షరా మామూలే. కానీ ఈసారి అలా ఇలా కాదు ఏకంగా అయిందు సినిమాలు వస్తున్నాయి. ఈ నెల 31న వరసగా  ఎన్జీకే, సువర్ణ సుందరి, ఫలక్ నుమా దాస్, అభినేత్రి 2, గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఫలక్ నుమా దాస్, సువర్ణ సుందరి స్ట్రెయిట్ సినిమాలు. మిగతా మూడూ డబ్బింగ్ సినిమాలు. 


ఇక ఈ మూవీస్ లో ప్రభుదేవా – తమన్నా కాంబినేషన్ మూవీ అభినేత్రిపై అంచనాలేవీ లేకపోయినా మిల్కీ వైట్ బ్యూటీ గ్లామర్ షో గురించి జనం అంతోఇంతో మాట్లాడుకుంటున్నారు. వీటితో పాటు జయప్రద – పూర్ణ- సాక్షి చౌదరి తారాగణంగా తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సువర్ణ సుందరి వీటితో పాటే బరిలో దిగుతోంది. వీటితో పాతు, హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గాడ్జిల్లా 2 బరిలో దిగుతోంది.


ఈ మూవీని ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లను రియల్ 3డీ- ఐమ్యాక్స్ 3డీలో రిలీజ్ చేస్తుండడంతో ఆ మేరకు మల్టీప్లెక్సుల్లో విపరీతమైన క్రేజు నెలకొంది. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించారు.ఇలా పెద్ద ఎత్తున మూవీస్ ఒకేసారి రావడం, ఇందులో క్రేజీ మూవీస్ కూడా ఉండడంతో సినీ వ్యూయర్లకు పండుగే అంటున్నారు. ఇందులో ఏవి హిట్ అవుతాయో తెలియదు కానీ అన్ని మూవీస్ మీద బాగానే అంచనాలు ఉన్నాయి. 
]


మరింత సమాచారం తెలుసుకోండి: