అదేంటీ అంత సెలబ్రెటీ ఈ మాటలు మాట్లాడటం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును తమిళనాడులో, ముఖ్యంగా చెన్నై నగరంలో ఎంత నీటి ఎద్దడి ఉందో, తాను ప్రత్యక్షంగా అనుభవించానని సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విషయాన్ని  'గూర్ఖా' అనే తమిళ మూవీ ఆడియో ఫంక్షన్లో సభికులకు నీటి గురించి హితబోద చేశారు బాలు.  ఇలాగే ఉంటే రాబోయే కాలంలో గుక్కెడు నీటి కోసం దోపడిలు, దొమ్మీలు చేసుకునే పరిస్థితి రావడం ఖాయమని అన్నారు.

ఈ రోజు మా ఇంట్లో నేను స్నానానికి అర బకెట్ నీళ్లకు అరగంట వేచి చూశాను. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు. ఓ ముఖ్యమైన విషయం చెబుతున్నాను. బంగారం, ప్లాటినం కన్నా నీరు విలువైనది. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు కూడా ఇచ్చారు..కంచాల్లో బోజనం చేసే బదులు వీలైనంత వరకు విస్తరాకుల్లో తింటే చాలా నీరు ఆదా అవుతుంది.

ప్రతిరోజూ బట్టలను మార్చే బదులు, వారంలో రెండు జతలు మాత్రమే ధరిస్తే, ఉతికేందుకు ఖర్చయ్యే నీరు మిగులుతుంది. నీరు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈనాడు నీటిని ఎంత కాపాడుకుంటే..భవిష్యత్ లో మన పిల్లకు వారి బిడ్డలకు నీరందుతుందని ఎస్పీబీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: