రత్తాలు వరుస బికినీలతో సోషల్ మీడియాలో హీట్ ను పెంచేస్తుంది. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.  'ఖైది నెం. 50' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రత్తాలు రత్తాలు అనే చార్ట్ బస్టర్ పాటకు స్టెప్పులేయడంతో అమ్మడి క్రేజ్ డబల్ అయింది.  లాస్ట్ ఇయర్ 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ సినిమాలో నటించింది కానీ అది పెద్దగా మెప్పించలేదు.


తన సినిమాలు హిట్టా.. ఫట్టా అనేదానితో సంబంధం లేకుండా రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను మురిపిస్తుంది. తాజాగా అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఒక సెల్ఫీని పోస్ట్ చేసింది.  ఈ సెల్ఫీకి రాయ్ లక్ష్మి ఇచ్చిన క్యాప్షన్ "మాల్టా డైరీస్".  ఐరోపాలోని ఒక అందమైన దేశం 'రిపబ్లిక్ ఆఫ్ మాల్టా'.  ఈ దేశంలో ఫుల్ గా చిల్ అవుట్ అవుతోందన్నమాట.  ఈ దేశం ఒక ద్వీపం. 


గ్రీస్ దేశానికి ఓ యాభై మైళ్ళ దూరంలో ఉంటుంది.  ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే.. లేత అరిటాకు రంగులోఉన్న బికిని ధరించి ఒక సెల్ఫీ తీసుకుంది.  లైట్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్.. పెద్ద సైజ్ కళ్ళజోడుతో స్టైలిష్ గా ఉంది.  ఒక చేత్తో సేల్ఫీ తీసుకుంటూ మరో చేత్తో తన అందమైన శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా పోజిచ్చింది. నేపథ్యంలో బీచ్ రిసార్ట్.. సముద్రం కనిపిస్తున్నాయి.  హాటు బ్యూటీ బికిని ధరిస్తే ఘాటుగానే ఉంటుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: