టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా రూ.250 కోట్లకు పైగా భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, తొలిసారి తన కెరీర్ లో ఒక స్వాతంత్రోద్యమ వీరుడిగా నటించడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా సినిమాలో మెగాస్టార్ నటన, యాక్షన్ మరియు డైలాగులకు థియేటర్స్ మారుమ్రోగడంతో పాటు పలువురు ప్రేక్షకులు మరియు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక, కేవలం యావరేజ్ టాక్ ని సంపాదించి, ప్రస్తుతం పర్వాలేదనిపించే కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార జోడి కట్టిన ఈ సినిమాలో తమన్నా మరియు నిహారిక కొణిదెల ఇతర ప్రత్యేక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ సహా పలువురు ఇతర భాషలకు చెందిన దిగ్గజ నటులు పలు ముఖ్య పాత్రల్లో నటిచడం జరిగింది. ఇక నేడు ఈ సినిమాను తన కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా వీక్షించిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, సైరా సినిమాపై అలానే ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవిపై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. "ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా'. 

చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు"  "బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటస్ఫూర్తితో రూపొందించిన 'సైరా' చిత్రం బాగుంది. నటులు శ్రీ చిరంజీవి, శ్రీ అమితాబ్ బచ్చన్,  దర్శకుడు శ్రీ సురేందర్ రెడ్డికి అభినందనలు. నిర్మాత శ్రీ రామ్ చరణ్ తేజ్ కు ప్రత్యేక అభినందనలు". అంటూ ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వేదికగా సైరా పై ప్రశంసలు కురిపించారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: