కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకో బోతున్నాడు. ఇప్పటి వరకు ఎందరో టాప్ హీరోయిన్లు తో ఎఫైర్స్ నడిపిన ఈ ముదురు బ్రహ్మచారి విదేశీ అమ్మాయితో తన జీవితాన్ని పంచుకోబోతున్నాడు. గత కొంతకాలంగా సల్మాన్ రొమేనియన్ మోడల్ లులియా వేంటర్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ జాతీయ మేగజైన్ ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఈ సంవత్సరం చివర్లో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇకపై తన జీవితం మరింత సంతోషంగా సాగుతుందని భావిస్తున్నట్లు సల్మాన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అంతే కాదు తాను అన్ని మతాలను గౌరవిస్తాననీ మతానికంటే మానవత్వాన్ని గౌరవమిస్తాను అంటూ ఇదే కార్యక్రంలో భారి డైలాగులు కూడా చెప్పాడు. తన కుటుంబం వివిధ మతాలు కలగలిపిన చక్కని కుటుంబం అని అంటూ తన తండ్రి నపఠాన్, తల్లి హిందు, చిన్నమ్మ క్యాథలిక్, బావ పంజాబీ అంటూ భిన్నత్యంలో ఏకత్వాన్ని ప్రభోదించాడు.  గతంలో ఓ ప్రముఖ పత్రిక రొమేనియా భామతో సల్మాన్ పెళ్లి విషయమై వార్తలు రాసి సల్మాన్ తండ్రిని సలీమ్‌ఖాన్‌ను ఈ విషయం పై ప్రశ్నించగా ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమెతో సల్మాన్ పెళ్లి వార్త కల్పితం మాత్రమే అంటు ప్లేట్ తిప్పాడు. కానీ ఇప్పుడు ఈ ముదురు బాలీవుడ్ బ్రహ్మచారికి పెళ్లిపై మనసు పడినట్లుగా అనిపిస్తోంది. మరి సల్మాన్ తన మాట ఎంత వరకు నిల పెట్టుకుంటా డో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: