బాలీవుడ్ యంగ్ హీరో ‘ధోనీ’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో అతని అభిమానులు విషాద సంద్రంలో మునిగిపోయారు. ఒక్క అభిమానులు మాత్రమే కాదు బాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా ఎంతో కృంగిపోతుంది.  సుశాంత్ కి ఎంతో భవిష్యత్ ఉన్నా అతను కొంతకాలంగా డిప్రెషన్ కి లోనయ్యాడని.. తనను బాలీవుడ్ పరిశ్రమ దూరంగా ఉంచుతుందని పలు మార్లు చెప్పుకొని వాపోయాడని అంటున్నారు.  సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయంపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఇక్కడ బందు ప్రీతి ఎక్కువగా ఉందని.. బయటకు చెప్పుకునేంత గొప్పగా లేదని విమర్శలు వచ్చాయి. 

 

బాలీవుడ్  అక్కడి వ్యక్తుల మనసులు కానీ ఉండవనే విషయాన్ని బయటకు వెల్లడిస్తున్నారు.  తాజాగా ఇదే అంశంపై నటి శ్రద్ధాదాస్ పలు విషయాలను వెల్లడించింది.  సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనివారు బాలీవుడ్ లో నిలబడటం చాలా కష్టమని నటి శ్రద్ధాదాస్ తెలిపింది.   ఒకప్పుడు సినీ పరిశ్రమ.. ఇప్పటి సినీ పరిశ్రమ వేరని..  మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్లు ఇండస్ట్రీలో ఎదగలేరని స్పష్టం చేసింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలనుకుంటే పార్టీలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. బాంద్రా, జుహూ ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్ లకు వెళ్లాల్సి ఉంటుందని  చెప్పింది.

 

ఇక్కడ ఎన్నో కష్టమైన అనుభవాలు ఎదుర్కొవలసి ఉంటుంది... కెరీర్ ని నిలబెట్టుకోవడానికి కొంత మంది నానా కష్టాలు పడుతుంటారని అన్నారు. పీఆర్ మేనేజర్లకు డబ్బులు ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని... డబ్బు తీసుకుని వారు చెప్పేది కూడా ఇదేనని చెప్పింది. వారు కూడా పార్టీలకు వెళ్లమనే సూచిస్తారని తెలిపింది. కొన్ని పరిస్థితుల్లో అసలు ఇండస్ట్రీకి  ఎందుకొచ్చామా? అని అనిపిస్తుందని తెలిపింది. బాలీవుడ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వెల్లడించింది.  ఈ రంగుల ప్రపంచంలో బతకాలంటే గుండె నిర్భరం కావాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: