రామ్ చరణ్ కెరీర్లో మంచి చిత్రాలుగా నిలిచిన వాటిల్లో ఎవడు కూడా ఒకటి. కమర్షియల్ వ్యాల్యూస్ తో పాటు, పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ అండ్ కీ రోల్ ప్లే చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. 

 

IHG

 

రామ్‌ చరణ్‌ నటుడిగా పరిణితి కోసం ప్రయత్నించడం లేదు. నటుడిగా తనని పరీక్షించే పాత్రల జోలికి వెళ్లడం లేదు. ఆరెంజ్‌ పరాజయం పాలవడంతో అతను పూర్తిగా సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయి... అన్నీ కమర్షియల్‌ సినిమాలే చేస్తున్నాడు. రచ్చ, నాయక్‌ తర్వాత అతని నుంచి వచ్చిన మరో ఫార్ములా సినిమా ఇది. ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా నటించాడు. ఫ్రీడమ్‌ సాంగ్‌లో డాన్స్‌లతో దుమ్ము రేపేసాడు. ఫైట్స్‌ లో ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌ బెటర్‌ చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నట్టు లేదు. 

 

IHG

 

అల్లు అర్జున్‌ ఉన్నది కాసేపే అయినా తన ముద్ర వేసాడు.సాయికుమార్‌ ఈ పాత్ర విషయంలో బాగా ఎక్సయిట్‌ అయ్యాడు. ఓ పెద్ద సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటించాననే ఆనందమే అయి ఉండాలి తప్ప ఈ పాత్ర అంత గొప్పగా ఏమీ లేదు. రొటీన్‌ క్యారెక్టరే కానీ సాయికుమార్‌ తన నటనతో దానికి వన్నె తెచ్చాడు. అతని పక్కన నిలబడి సలహాలిచ్చే పాత్రలో కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో అలరించారు. జయసుధ ఈ చిత్రానికి హైలైట్స్‌లో ఒకరిగా నిలిచారు. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. ఆడియో పరంగా సోసో సాంగ్స్‌ ఇచ్చినా కానీ ఆ లోటుని అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కవర్‌ చేసాడు. ఇలాంటి మాస్‌ సినిమాలకి మణిశర్మ నేపథ్య సంగీతంతో ప్రాణం పోసేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: