2006 జూన్ 5వ తేదీన విడుదలైన కితకితలు సినిమా అల్లరి నరేష్ కెరీర్ లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లరి నరేష్, గీత సింగ్, మధు శాలిని, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ కథ అందించడంతో పాటు తానే దర్శకత్వం కూడా వహించారు. పోకిరి సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ చిన్న సినిమా విడుదలై వంద రోజుల పాటు ఆడి అందరినీ ఆశ్చర్య పరిచింది. కితకితలు సినిమా కథ గురించి తెలుసుకుంటే రేలంగి రాజు బాబు తన కాబోయే భార్య కోసం పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ఒక యువతి అతడిని శారీరకంగా లోబర్చుకోవడానికి ప్రయత్నించగా... అతడు లొంగకుండా తన శీలాన్ని కాపాడుకోవడంతో పాటు ఆమెపై కేసు కూడా వేస్తాడు.


రేలంగి రాజబాబు కి ఎస్సై ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు అతడిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు. కానీ చాలామంది రేలంగి రాజబాబు లో మగతనం లేదని అనుమానిస్తూ అతడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. చివరికి రేలంగి రాజబాబు ని కాస్త బొద్దుగా ఉండే సౌందర్య కి ఇచ్చి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. భార్య లావుగా ఉందని, అందంగా లేదని రాజబాబు అసంతృప్తితో సంసారం కూడా చేయడు.


ఈ క్రమంలోనే అతడికి రంభ పరిచయమవుతుంది. కారు బంగ్లా చూసి అతడిని ఇష్టపడిన రంభ... అవేమీ రాజబాబు సొంతం కాదని తెలుసుకొని అతడిని వదిలేస్తుంది. దీంతో రాజబాబు పుట్టెడు దుఃఖం లో మునిగి పోగా... సౌందర్య వచ్చి అతడిని ఓదారుస్తుంది. అప్పుడే అందం కంటే గుణం మంచిదని రాజబాబు అర్థం చేసుకొని సౌందర్యని
తన భార్య గా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ముఖ్యంగా రాజబాబు, సౌందర్య పెళ్లి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: