ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో ఫాం లో ఉన్న వారిలో అడివి శేష్ ఒకరు. తను ఎంచుకునే కథలు తీసే సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో కొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఒకప్పుడు హీరో కమ్ డైరక్టర్ గా సినిమాలు చేసినా అతన్ని పట్టించుకోలేదు కాని ఇప్పుడు అతని సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదిలాఉంటే అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి సీక్వల్ తో పాటుగా మేజర్ సినిమా చేస్తున్నాడు. గూఢచారి సినిమా ఆల్రెడీ రిలీజ్ కు రెడీగా ఉంటే మేజర్ కొద్దిపాటి షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమా కోసం అడివి శేష్ ఒకటి రెండు కాదు ఏకంగా 8 కిలోల వెయిట్ లాస్ అయ్యాడట. క్యారక్టర్ కోసం బరువు తగ్గడం.. పెరగడం లాంటివి చేయడం కామనే అయితే స్టార్స్ ముఖ్యంగా ఈ విషయంలో ముందుంటారు కాని అడివి శేష్ కూడా వారిలా పాత్ర కోసం రిస్క్ తీసుకుని మరి వెయిట్ తగ్గించుకున్నాడట. దీనికి తగినట్టుగా తన డైట్ కూడా ప్లాన్ చేసుకున్నాడట. మేజర్ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ అదరగొడతాడని తెలుస్తుంది.

గూఢచారి సినిమాను డైరెక్ట్ చేసిన శషి కిరణ్ తిక్క మేజర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శషికిరణ్ ఓ పెద్ద సినిమా ఆఫర్ ను కూడా వదులుకున్నాడు. మేజర్ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ కూడా ఉంటుందని టాక్. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి అడివి శేష్ మేజర్ కోసం రిస్క్ తీసుకుని మరి 8 కిలోల వెయిట్ తగ్గాడు. మరి ఈ హీరో పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: