సమంత అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక మాయ.. ఆమె సినిమాలలో చేసే ఇంద్రజాలం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకేనేమో ఆమె చేసే ఏ సినిమా అయిన సూపర్ హిట్ అవుతున్నాయి. పెళ్లికి ముందు కాస్త గ్లామర్ ఉన్న పాత్రల్లో నటించిన కూడా..పెళ్లి అయ్యాక ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ వస్తుంది..ఆ సినిమాలన్నీ హిట్ అయ్యి ఆమె స్థాయిని మరింత పెంచాయి. అలా ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది.


ఇటీవల విడుదలైన ప్రయోగాత్మక చిత్రం ఓ బేబీ తో మంచి టాక్ ను అందుకుంది. ఆ సినిమాలో సమంత చేసిన సాహసాన్ని మెచ్చుకునే తీరాలి.ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రశంసలను అందుకుంది.కాగా, ఇప్పుడు సామ్ గ్లామర్ పాత్రల కన్నా డేరింగ్ ఉన్న పాత్రలను చేయడానికి మక్కువ చూపిస్తుంది. అలాంటి కథలు ఉంటేనే సినిమాలు చేస్తానని కొన్ని సందర్బాల్లో చెప్పింది.



ఈ నేపథ్యంలో మరో ప్రయోగాత్మక చిత్రం లో నటించబోతుందన్న టాక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.మయూరి', గేమ్ ఓవర్' చిత్రాలను రూపొందించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించబోతుంది.ఈ సినిమాలో మూగ, బధిర అమ్మాయి పాత్రలో సామ్ కనిపించక బోతుంది. సస్పెన్స్, హారర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. సమంత ఇప్పటి వరకు చేసిన పాత్రలకు ఈ పాత్ర భిన్నంగా ఉంటుందని దర్శకుడు అంటున్నారు.ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవ్వబోతుందట.మరీ సామ్ కు ఈ సినిమా ఏ మాత్రం హిట్ ను అందిస్తుందో చూడాలి. ఈ సినిమా తో పాటుగా మరో ఛాలెంజింగ్ రోల్ లో కూడా నటించబోతోందట..ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సామ్ సేంద్రీయ పద్దతులలో మొక్కలను నాటడం ఎలా అనే విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: