
అక్టోబరు రెండవ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లో నిశ్శబ్దం సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ట్రైలర్ కూడా విడుదల అయ్యి భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే అదే రోజున ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ పై రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదల కాబోతుంది. దాంతో రెండు సినిమాలు ఏకకాలంలో విడుదల అవుతుండగా వాటి మధ్య పోటీ ఎలా నెలకొంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి రాజ్ తరుణ్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ డిజాస్టర్ సినిమాలనే చవిచూస్తున్నారు. అందుకే అతని సినిమాలను చూడ్డానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపారని చెప్పుకోవచ్చు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాని కనీసం ప్రచారం కూడా చేయడం లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యం మాత్రం నిశ్శబ్దం సినిమా గురించి వారం రోజులుగా దక్షిణ భారతదేశం మొత్తం తెలిసేలా ప్రచారం చేస్తుంది. దాంతో అనుష్క నిశ్శబ్దం సినిమా పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో ఒరేయ్ బుజ్జి గా అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని చూడటానికి తక్కువ మంది ప్రేక్షకులే ఆసక్తి చూపుతారు అర్థం చేసుకోవచ్చు.