రాజకీయనాయకుడు కొడుకు రాజకీయనాయకుడు.. డాక్టర్‌ కొడుకు డాక్టర్, యాకర్ట్‌.. యాక్టర్‌ కొడుకు యాక్టర్‌ అవ్వాలన్న రూలు లేకపోయినా.. చాలామంది తండ్రి బాటలోనే నడుస్తారు. ఇందుకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మినహాయింపేమీ కాదు. ఇద్దరు యువ సంగీత దర్శకులు వారసత్వాన్ని పుణుకిపుచ్చుకుని.. తండ్రి పేరు నిలబెడుతున్నారు.

తెలుగు సంగీత కీర్తి కిరీటంలో కీరవాణి ఒకరు. విలక్షణమైన గానంతో.. బాణీలతో ఆకట్టుకున్నారు. ఆయన వారసుడు కారభైరవ గాయకుడిగా  తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. బాహుబలి2లో పాడిన దండాలయ్యా సాంగ్‌ కాల భైరవకు పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవలో పాడిన పెనిమిటి సాంగ్‌ ఈ యువ వాయిస్‌కు క్రేజ్ వచ్చింది.

గాయకుడిగా దాదాపు 50 పాటలు పాడిన కాలభైరవ చిన్న సినిమా 'మత్తువదలరా'తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమాతో కాలభైరవ తమ్ముడు సింహా హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. రెండో సినిమా కలర్‌ఫొటో'కు ఇచ్చిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. వయోలిన్‌తో ఇచ్చిన ట్యూన్‌ హృదయాన్ని తాకింది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అయిన మరో వారసుడు మహతి స్వర సాగర్‌. మణిశర్మ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తన టాలెంట్‌తో వరుస ఆఫర్స్‌ అందుకుంటున్నాడు. ఛలో మూవీ మహతీకి తొలి హిట్‌ తీసుకొచ్చింది. భీష్మ సక్సెస్‌తో పాపులర్‌ అయ్యాడు ఈ యంగ్‌ మ్యూజీషియన్. యంగ్ హీరోల మూవీస్‌కు మెయిన్‌ ఆప్షన్ అయ్యాడు మహతి.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కోటి కొడుకు రోషన్‌ కూడా గుర్తింపుకోసం వెయిట్‌ చేస్తున్నాడు. గాయకుడు అనే మూవీతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సాలూరు రాజేష్‌  ఏ సినిమాతో నిలబడతాడోగానీ..మొత్తానికి ఇండస్ట్రీలో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వారసుల హవా మొదలైందనే చెప్పాలి.

మొత్తానికి ప్రముఖ సంగీత దర్శకుల కుమారులు సత్తా చాటుతున్నారు. కీరవాణి కుమారుడు కాలభైరవ గాయకుడిగా పరిచయమై ప్రేక్షకుల నోళ్లలో నానుతున్నాడు. మత్తువదలరాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవ కలర్ ఫోటోతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరైపోయాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: