పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ లో లాయర్ పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్,క్రిష్ సినిమాలో పండుగల సాయన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. దిల్ రాజు, బోనికపూర్ కలిసి వకీల్ సాబ్ ని నిర్మిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారధ్యంలో క్రిష్ సినిమా తెరకెక్కుతోంది. ఇకపోతే వీటిలో వకీల్ సాబ్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దీని తాజా షెడ్యూల్ ను ఇటీవల ప్రారంభించారు. కాగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా లాక్ డౌన్ కి ముందు రెండు షెడ్యూల్స్  జరుపుకోగా అతి త్వరలో దాని తదుపరి షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించనున్నరు పవన్ కళ్యాణ్. ఆపై మలయాళ రీమేక్ మూవీ అయిన అయ్యప్పన్ కోషియం లో కూడా నటించనున్నారు పవన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచార్ని బట్టి ఈ సినిమా లోని పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం అతి త్వరలో పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ బాడీని పెంచనున్నారని ఇప్పటికే ఈ విషయమై దర్శక నిర్మాతలు పవన్ తో చర్చించడం అలానే దానికి పవన్ కూడా ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం అతి త్వరలో వెండి తెరపై పవర్ స్టార్ ని సిక్స్ ప్యాక్ బాడీతో చూడవచ్చన్న మాట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: