మనుషులు అందరు ఒకేలాగా ఉండరు. ఎవరి అభిరుచులు వారివి.. ఎవరి ఇష్టాలు వారివి. అలాగే ఎవరి టాలెంట్ వారిది. ఒకళ్ళు హీరో అవుతారు. మరొకరు డాన్సర్ అవుతారు. ఇంకొకరు కమెడియన్ అవుతారు. అలా ఎవరిలో ఉన్న నైపుణ్యం వాళ్ళది. అయితే మన సినీ ఇండస్ట్రీలో కొందరు నటులు కామెడీని మాత్రమే పండించగలరు..అలాగే మరికొందరు విలనిజానికి పెట్టింది పేరు..కానీ తెలుగు సినిమా తెరపై మొదటగా  విలన్ గా పరిచయం అయి,ఆ తర్వాత కమెడియన్స్ గా మారినవారూ కూడా ఉన్నారు  వాళ్ళు ఒకేసారి రెండిటిని నటించగల  నటులు.అలాగే ప్రేక్షకులను ఒకపక్క నవ్విస్తూనే, మరోపక్క భయపెడుతూ ఉంటారు. అలాంటి నటులు ఎవరో తెలుసుకుందాం.. ! ఈ కోవలోకి చెందిన వారిలో  మనకి ముందుగా గుర్తొచ్చే పేరు కోటాశ్రీనివాసరావు.ఒకానొక సమయంలో తెలుగు సినిమాలో విలన్ అనగానే కోటా పేరే వినిపించేది. విలన్ గా భయపెట్టినా, కమెడియన్ గా నవ్వించినా  అది కోటాగారికే చెల్లింది.అలాగే మరొక నటుడు ప్రకాశ్ రాజ్.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగల  నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు..అలాగే  అందరిని భయపెదుతూనే, మరోపక్క కామెడీని పండిస్తారు. అలాగే మరొక గొప్ప నటుడు జయప్రకాశ్ రెడ్డి .. ప్రేమించుకుందాం రా సినిమాలో ఈయన నటనకి అందరూ భయపడ్డారు.తర్వాత ఈయన కమెడియన్ పాత్రలు చేసి అందరిని నవ్వించారు.  ఏందబ్బీ..అని ఈయన అంటుంటే ఆ డైలాగ్ డెలివరీకే అందరికి నవ్వొచ్చేసేది.

అలాగే ఈయన పేరు వింటేనే చాలు అందరికి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఆయనే ప్రదీప్ రావత్..ఎవరబ్బా ఈయన అనుకుంటున్నారా. సై, సినిమాలో బిక్షూ యాదవ్ గా విలన్ పాత్ర పోషించాడు ఈయన. సై సినిమాలో ఈయన వేషదారణ, ఆ వాయిస్ వింటే అందరు భయపడతారు. అలాంటి ఈయన తర్వాత కమెడియన్ గా నవ్వించారు..నేను శైలజ మూవీలో ప్రదీప్ రావత్ పాత్ర చూసి ఈయనకా మనం భయపడ్డాం అని డౌటొస్తుంది.అలాగే మరొక విలక్షణ నటుడు షియాజీ షిండే.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో విలనిజాన్ని పండించే నటుడు..ఒక్క చూపు చూస్తే చాలు భయపడిపోయేలా చేసేవారు..కానీ ఒక్కసారి దుబాయ్ శీనులో షిండే క్యారెక్టర్ చుస్తే నవ్వు ఆపుకోలేము.  అలాగే మరొక నటుడు కృష్ణ భగవాన్.. ఏంటి ఈయన విలన్ గా ఎప్పుడు నటించాడు అనుకుంటున్నారా..  ఏప్రిల్ 1 విడుదల సినిమాలో  నెగటివ్ రోల్ పోషించారు..తర్వాత సుమారు పదేళ్లపైనే తెరపైన కనిపంచలేదు..మళ్లీ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో కమెడియన్ గా పరిచయం అయి వెనుదిరిగి చూస్కోకుండా తన కామెడితో ప్రేక్షకులను అలరించారు.

అలాగే గిరిబాబు కొడుకు రఘుబాబు.. తన తండ్రి బాటలోనే కామెడీని, విలనిజాన్ని పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు..రఘుబాబు కూడా రెండు రకాల పాత్రల్ని పోషించారు..ప్రస్తుతానికి కమెడియన్ గా సెటిల్ అయ్యారు.అజయ్.. విక్రమార్కుడు సినిమాలో టిట్లాగా అజయ్ పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. అంతకుముందు ఆ తర్వాత అజయ్ ఎక్కువగా నెగటివ్ రోల్స్ పోషించాడు..కొన్ని సినిమాల్లో తన కామెడితో నవ్వించాడు. అలాగే సుబ్బరాజు కూడా మంచి  విలక్షణ నటుడు.. తెరపై మొదట నెగటివ్ రోల్స్ తోనే పరిచయం అయ్యారు..తర్వాత  అన్ని రకాల పాత్రలు పోషించిన సుబ్బరాజు తన హస్యనటనతో ప్రేక్షకులను నవ్వించారు. ఈ లిస్ట్ లో ఉన్నవాళ్లు తమ డ్యూయల్ టాలెంట్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: