ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య తరువాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే చిత్రం మళయాళ లూసిఫర్ రీమేక్. ఈ చిత్రంలో తమిళంలో మోహన్‌లాల్ నటించగా తెలుగులో చిరంజీవి మెప్పించనున్నారు. లూసిఫర్‌ను మళయాళంలో హీరో పృధ్వీరాజ్ తెరకెక్కించాడు. పృధ్వీకి డైరెక్టర్‌గా అదే తొలి సినిమా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న చిరంజీవి డైరెక్టర్‌గా దర్శకుడు మోహన్ రాజా ఎంపికచేశాడు.

మోహన్ రాజా తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన గురించి తెలియని వాళ్లు మోహన్ రాజాకు తెలుగులో ఇదే తొలి  సినిమా అనుకుంటారు. అయితే ఆయన తెలుగులో ఇప్పటికే ఓ సినిమా తీశారని తెలుసా..? అవును.. మోహన్ రాజా తెలుగులో సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఓ సినిమా చేశారు. అది అప్పట్లో బంపర్ హిట్ అయింది.  హనుమాన్ జంక్షన్.. అర్జున్, జగపతి బాబు, వేణు హీరోలుగా 2001లో మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయింది. వేణు, ఎల్‌బీ శ్రీరాం మొదలైన వాళ్ల కామెడీకి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది.

ఆ చిత్రం తరువాత మళ్లీ ఇన్నేళ్లకు మోహన్ రాజా తెలుగులో మెగాఫోన్ పట్టుకోనున్నారు. అది కూడా మెగాస్టార్ కోసం. తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘21-12-2001లో నా తొలి తెలుగు చిత్రం హనుమాన్ జంక్షన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ సినిమా విడుదలైనప్పుడు థియేటర్లలో విన్న నవ్వులను నేను ఇప్పటికీ మరిచిపోలేన’ని మోహన్ రాజా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు తన సినిమాలకు చెందిన కొన్ని ఫోటోలను జత చేశాడు.

మోహన్ రాజా తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన గురించి తెలియని వాళ్లు మోహన్ రాజాకు తెలుగులో ఇదే తొలి  సినిమా అనుకుంటారు. అయితే ఆయన తెలుగులో ఇప్పటికే ఓ సినిమా తీశారని తెలుసా..? అవును.. మోహన్ రాజా తెలుగులో సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఓ సినిమా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: