ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తల్లిగారు కన్ను మూయడం జరిగింది.ఆయన తల్లిగారు కరీమా బేగం  సోమవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచారు. కరీమాకు నలుగురు సంతానం కాగా.. రెహమాన్ చిన్నవాడు. తొమ్మిదేళ్ల వయసులోనే రెహమాన్ తండ్రి ఆర్‌కే శేఖర్‌ చనిపోయారు.. ఇప్పుడు తల్లిని కూడా రెహమాన్ పోగొట్టుకున్నారు.

రెహమాన్ తండ్రి శేఖర్ మరణం తర్వాత కరీమాబేగం కస్తూరి శేఖర్ తో  కలిసి రెహమాన్ ఇస్లాం మతం స్వీకరించి పేర్లు మార్చుకోవడం జరిగింది. రెహమాన్‌కు తల్లితో అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. తాను కెరీర్లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించేవారు. కరీమా బేగం మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్థున్నారు.

ఇక ఏఆర్ రెహమాన్ ఎంత గొప్ప టెక్నిషియనో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు సాధించారు. "స్లమ్ డాగ్ మిలియనీర్" సినిమా కి మ్యూజిక్ కి గాను ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నారు. దేశానికి ఎంతో గొప్ప పేరుని తీసుకొచ్చారు. కాని అలాంటి గొప్ప వ్యక్తికి మాతృ వియోగం కలగడం బాధాకర విషయం. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: