ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ 2020 వ సంవత్సరం నిజంగానే ఎంతో విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి.. ఎందుకంటే ఒక పక్క కరోనా పాటు పలువురు సినిమా ప్రముఖులు కూడా మరణించడం జరిగింది. అందులోను ఒక ఇద్దరి మరణాలను సినిమా ప్రేక్షక ప్రియులు జీర్ణించుకోలేకపోయారు. అందులో ఒకరిది ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం అయితే రెండోది ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య అయితే దేశంలోనే చాలా మందిని ఎంతగానో బాధపెట్టింది. బాలీవుడ్ యంగ్ హీరో. మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు, మార్కెట్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం బాలీవుడ్ లో కలకలం రేపింది. అంతేకాదు, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. జూన్ 14వ తేదిన సుశాంత్ చనిపోయిన తర్వాత తన ఆఖరి సినిమా దిల్ బేచారా ఓటీటీలో రిలీజైంది.

అతని ఆత్మ హత్యకి యావత్ భారత్ దేశం అంత కన్నీరుమున్నీరయ్యింది.ఇక రెండోది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కూడా ఎంతో బాధ పెట్టింది.బాల సుబ్రహ్మణ్యం మరణం కూడా పలువురిని కంట తడి పెట్టించింది.గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25వ తేదిన కన్నుమూశారు. బాలుకి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. తండ్రి ఆరోగ్యం కోసం ఎస్పీ చరణ్ ప్రత్యేకంగా ఆయుష్ హోమాన్ని సైతం నిర్వహించారు. కానీ, కరోనాతో పోరాడుతూ చెన్నైలో బాలూ కన్నుమూశారు.

తన గాత్రంతో అందరి మనుసులు దోచిన బాలూ అందరినీ వదిలి శాశ్వతంగా శివైక్యం చెందారు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన బాలు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదనే చెప్పాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: