సూపర్ స్టార్ కృష్ణ అండ్ విజయ నిర్మల జోడిగా నటిస్తే ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరు కలిసి జోడిగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని 50 వ ఏట అడుగుపెట్టింది.ఈ చిత్రాన్ని  పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇంకో విశిష్టత కూడా ఉంది. అది ఏంటంటే ఈ సినిమా  తొలి భారతీయ కౌబాయ్ చిత్రం అవ్వడం.  అలాగే ఈ చిత్రం సాధించిన రికార్డులు కూడా అన్ని ఇన్ని కావు.అలాగే ఈ చిత్రంలో కనిపించే  ఏడారులు, గుర్రపు ఛేజింగ్‌లు భలే ఉంటాయి. అలాగే  నిధికోసం ఎత్తుకు పై ఎత్తులు వేయడం సినిమా మొత్తం ఎంతో ఉత్కంఠను రేపుతోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్ అన్ని కలిపి  తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారుపేరు.


 తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి సినిమాఅంటే  ఎలా ఉంటుందో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా ద్వారా  రుచి చూపించారు. ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు అందరు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పట్లో  ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రూ. 6 లక్షల 30 వేలతో నిర్మించారు.  కేవలం తమిళ డబ్బింగ్ వెర్షన్‌లోనే దాదాపు రూ. 7లక్షలు కలెక్ట్ చేసి తమిళంలో కూడా ఓ చరిత్ర సృష్టించింది.తెలుగులో ఓ చరత్రి సృష్టించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం హిందీలో ‘ఖజానా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఇంగ్లీష్‌లో ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో డబ్ చేసారు.


అంతేకాదు అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రికార్డు క్రియేట్ చేసింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. దక్షిణ భారత దేశం నుంచి ఈ సినిమా మాత్రమే ఎంపిక చేయబడడం విశేషం.మోసగాళ్లకు మోసగాడు’ తరహాలో తెలుగులో ఆ తర్వాత ‘మంచివాళ్లకు మంచివాడు’ ’నిజం నిరూపిస్తా’ ‘మెరుపుదాడి’, కొదమ సింహం’, కౌబాయ్ నెం. 1’, ‘టక్కరి దొంగ’ వంటి పలు కౌబాయ్ చిత్రాలు తెరకెక్కాయి.కృష్ణ కి మాత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: