టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మూవీ అత్తారింటికిదారేది. అత్తారింటికి దారేది మూవీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రంగా అత్తారింటికి దారేది మూవీ ఉంది. ఇంతలా గ్రాండ్ సక్సెస్ సాధించిన అత్తారింటికి దారేది మూవీని ఇప్పుడు కన్నడలో సుధీప్ రిమేక్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నడ సూపర్ స్టార్ గా బ్లాక్ బాస్టర్ సక్సెస్ లని చిత్ర పరిశ్రమకి అందిస్తున్న సుధీప్, అత్తారింటికి దారేది మూవీ రిమేక్ పై ప్రత్యేక శ్రద్ధని చూపుతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన స్టారింగ్ సెలక్షన్స్ కూడ దాదాపు పూరైంది. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ప్రణీత పోషించిన పాత్రలో కనిపించనుంది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటిస్తుంది. సమంత పాత్రతో పాటు, ప్రణీత రోల్ కూడ అత్తారింటికి దారేది మూవీలో ప్రాముఖ్యత కలిగిన రోలే. అందుకే సుధీస్ అత్తారింటికి దారేది మూవీలోని అదే కాస్టింగ్ ని తీసుకోవాలని చూశాడు. అయితే సమంత, ప్రణీతలు ఎక్కువ రెమ్యునరేషన్ ని అడగటంతో అందులోని కాస్టింగ్ ని వెంటనే మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రణీత స్థానంలో హరిప్రియ తీసుకోడమే కాకుండా ఈమెకి రెమ్యునరేషన్ కూడ భారీగానే ఇస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. హరిప్రియ ఒక సన్నివేశంలో 30 సెకన్ల పాటు సెమీన్యూడ్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు గానూ హరిప్రియ ఈ మూవీ కోసం దాదాపు 60 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గతంలో హరిప్రియ రెమ్యునరేషన్ కేవలం నలభై లక్షలకు తక్కువుగానే ఉంది. ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయిన సుదీప్, టాలీవుడ్ లోనూ తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. అలాగే రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’లో అతిధి పాత్రలో నటించారు. ఇటివలే మిర్చి సినిమాను కన్నడలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: