సంక్రాంతి అంటేనే సందడి.. అదీ సినిమా సందడి.. అది కరోనా అయినా, స్టైయిన్ అయినా సరే ఆగేది లేదు, తగ్గేది లేదు. ఇరు తెలుగు రాష్ర్టాల్లో సినిమా థియేటర్లు కళకళలాడుతున్నాయి. డబ్బింగ్ సినిమా కాదు, యావరేజ్ టాక్ వచ్చిన సినిమా కాదు అన్ని సినిమాలకు జనం ఎగబడుతున్నారు అది తెలుగు వారు సినిమాకి ఇచ్చే ప్రాధాన్యమంటే. గత ఏడాది సంక్రాంతి తరువాత థియేటర్లన్నీ మూకుమ్మడిగా మూతబడ్డాయి. అప్పటి నుంచి నెల రోజుల క్రితం వరకు దాదాపుగా 10 నెలలు పాటు వెండితెర చూడక మన సినీ ప్రియులు మోహమాసిపోయి ఉన్నారు. ఇప్పుడు అసలే సంక్రాంతి పండుగ అందులోనూ నాలుగు కొత్త సినిమాలు వరుసన వస్తే ఊరుకుంటారా..? మనవాళ్లు. సినీ సరదా అంతా తీర్చుకుంటున్నారు. 

                           గ్రేటర్, పట్నం, పల్లె అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని సినిమా హాళ్ల ముందు జనాలు క్యూ కడుతున్నారు. అన్ని షోలు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా జోరుగా సాగుతున్నాయి. అసలు ఇక్కడ కరోనా మచ్చుకైనా ఉందా..? లేదా..? అన్నట్లుగా ప్రజలు సినిమాలకు ఎగబడటం చూసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాగే లోలోపల సంతోషంతో గంతులేస్తున్నారు కూడా. ఓటీటీలు, అమెజాన్ వంటి మొబైల్ తెరలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కూడా థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. ఆ రుచికి మన తెలుగు వారు బాగా అలవాటు పడ్డారు. 

            ఇటీవల జరిగిన  క్రాక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మాట అన్నారు. వీడేం పీకుతాడులే అని కాకుండా ఏదో ఒకటి పీకితే బాగుండు..అన్నట్లు జనాలు ఎదురుచూస్తున్నారు.. అని అనిల్ అన్నారు.  అది అక్షరాల నిజం అన్నట్లు ఆడియన్స్ రుజువు చేస్తున్నారు. ఓ సినిమా యావరేజ్ అని టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. తమిళ డబ్బింగ్ మాస్టర్ సినిమాను కూడా బాగా చూస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ అసలైన సందడిని తెచ్చిందని నిస్సందేహంగా అనుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: