సెలబ్రిటీ అంటే చాలు వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. ఇక అందుకే మీడియా వారు సైతం సెలబ్రిటీలు కనపడితే చాలు వారి పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తారు. ఈ క్రమంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక చోట తక్కువ పెదవి విప్పుతారు సెలబ్రిటీలు. ఇంకేముంది ఎంతగానో ప్రేమించే తమ ప్రియతమ తారల రియల్ లైఫ్ విశేషాలు వింటూ ఫుల్ ఖుషీ అవుతారు అభిమానులు. ఇప్పుడు ఇదే తరహాలో బిగ్ బాస్ బ్యూటీ లవ్ మ్యాటర్ ను  బయటపెట్టడం తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

తాజాగా ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న బిగ్‏బాస్ సీజన్ 14లో ఇజాజ్ ఖాన్ స్థానంలోకి ఛాలెంజర్‏గా ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి దేవోలినా. అయితే దేవోలినా తన తోటి కంటెస్టెంట్ రాఖీ సావంత్ తో వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో.... దేవోలినాను టక్కున ఓ ప్రశ్న అడిగి షాక్ ఇచ్చింది రాఖీ సావంత్ . ఈ క్రమంలోనే మరో కంటెస్టెంట్ రాహుల్ వైద్య అంటే నీకు ఇష్టమేనా అని అడుగగా.. తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు  చెప్పుకొచ్చింది దేవోలినా. కానీ అతడు ఎవరు ఏంటి అన్న విషయాన్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే.... దేవోలినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే.“సాథ్ నిభానా సాథియా” అదే హిందీ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించింది దేవోలినా. ఈ సీరియల్ "కోడలా కోడలా కొడుకు పెళ్ళామా” పేరుతో డబ్ అయింది. ఈ పాత్ర పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ అందాల బొమ్మ. మొదట బిగ్ బాస్ సీజన్ 13 లో అడుగుపెట్టిన  దేవోలినా... అనారోగ్య సమస్య కారణంగా షో నుండి మధ్యలోనే తప్పుకుంది. కాగా ఇప్పుడు మళ్లీ  సీజన్ 14 లో ఎంట్రీ ఇచ్చి ఫుల్ అల్లరి చేస్తోంది ఈ హిందీ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి: