ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌లోని ప్రముఖ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా ఈ ఫ్యామిలీ నుంచి దాదాపు 11మంది హీరోలు తెలుగు
వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీలో
పెళ్లి బాజా వినిపించిన సంగతి తెలిసిందే. మెగా డాటర్
నిహారిక వివాహ వేడుకలతో సందడి చేశారు. రాజస్థాన్‌లో
పెళ్లి వేడుకను జరిపారు. అయితే
నిహారిక వివాహం తరువాత మెగా కాంపౌండ్‌లో
పెళ్లి బాజా మోగించేది ఎవరంటే ఎక్కువగా వినిపించిన పేరు సాయి ధరమ్ తేజ్.
అప్పట్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తేజ్ తనకు
పెళ్లి ఆలోచన లేదని దాదాపు మరో నాలుగు సంవత్సరాలు సోలోగానే ఉంటానని అన్నారు. అంతేకాకుండా
అల్లు శిరీష్ తనకన్నా పెద్దవాడంటూ శిరీష్‌ని ఇరికించాడు. అయితే తాజాగా వస్తున్న వార్తలు ప్రకారం ఈ ఏడాదిలో మెగా కాంపౌండ్‌లో మళ్లీ
పెళ్లి బాజా వినిపించనుందంట. అది కూడా ఎవరిదో కాదు.
సోలో బ్రతుకే సో బెటర్ అంటూ
ప్రేమ,
పెళ్లి వద్దన్న సాయి ధరమ్ తేజ్ వివాహమేనంట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

కేవలం మరో మూడు నెలల్లోనే, అంటే మే నెలలోనే సాయి ధరమ్ తేజ్
పెళ్లి పీటలెక్కడున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో ఎంత నిజమనేది ఇంకా తెలియక పోయినా మెగా అభిమానులు మాత్రం అప్పుడే
పెళ్లి పనులు ప్రారంభించేశారు. అయితే ఇప్పుడు అభిమానుల్లో మరో ప్రశ్న వెలుగు చూసింది. తేజ్ చేసుకుంటుుంది
లవ్ మ్యారేజా..? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా..? అని డౌట్ పడుతున్నారు. అయితే సాయి తేజ్ చేసుకుంటుంది పెద్దలు కుదిర్చిన పెళ్లేనని,
అమ్మాయి హీరోయిన్ కాదని, ఫ్యామిలీకి బాగా తెలుసని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇంత జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి
సాయి ధరమ్ తేజ్ నుంచి కానీ, మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. కాబట్టి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం
సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం రిపబ్లిక్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను
దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ
సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.