ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండియాస్ జేమ్స్ కామెరూన్ గా మంచి పేరు సాధించాడు. ఎన్నో  ఘనవిజయాలు అందుకున్నాడు. అయితే ఎన్నో సినిమాలను రూపొందించిన శంకర్ ఇప్పటివరకు ఒక్క తెలుగు హీరోతో కూడా మూవీ చెయ్యలేదు. తాజాగా శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే కొరటాల శివ, చిరంజీవి కాంబోలో తెరకెక్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు.

 ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి.తాజాగా చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అదెంటంటే.. శంకర్ తీసే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో.. అందులోని సాంగ్స్ కూడా అదే రేంజ్‏లో హిట్ అవుతాయి. దాదాపు ఆయన సినిమాలన్నింటికి ఆయన సన్నిహుతుడు ఏ.ఆర్.రెహమాన్ కానీ హ్యారిస్ జైరాజ్ కానీ సంగీతాన్ని అందిస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం శంకర్ ఈసారి వీరిద్ధరిని కాదని.. మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‏కు ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అతనేవరో కాదు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‏ను ఈ సినిమా కోసం సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటి వరకు ఈ వార్త సంబంధించి ఎలాంటి అఫిషియల్ అప్ డేట్ రాలేదు. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని తీసుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: