తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ మీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని సీక్రెట్ లను బయట పెట్టారు. ఈ ఇంటర్వ్యూలో తన జీవితం లో తనకి ఒక్కరు కూడా లవ్ ప్రపోజ్ చేయలేదని ఆమె వాపోయారు. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత హీరోయిన్లకు లవ్ ప్రపోజల్స్ రావడం సర్వసాధారణం. కానీ మీనా విషయంలో మాత్రం అలా జరగలేదట.

ఎందుకని అడిగితే తనతో నటించిన హీరోలందరూ తనకంటే చాలా పెద్దవారు అని .. వారందరికీ అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని.. అందుకే ఏ హీరో కూడా తనకి లవ్ ప్రపోజ్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. సినిమా టెక్నీషియన్లు కూడా తనకంటే వయసులో చాలా పెద్దవారు అని.. దీంతో తనని ఒక చిన్న పిల్లలాగానే ప్రతి ఒక్కరూ భావించేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్లనే తనకు లవ్ ప్రపోజల్స్ రాలేదని చెప్పుకొచ్చారు.

తాను హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రోజా, రమ్యకృష్ణ, నగ్మా తనకు బాగా పోటీ ఇచ్చేవారని ఆమె వెల్లడించారు. వీరి ముగ్గురిలో ఎవరు బాగా పోటీ ఇచ్చేవారు? అని అడిగితే.. రోజా అని మీనా సమాధానమిచ్చారు. అప్పట్లో రోజా చాలా బోల్డ్ గా వ్యవహరించేవారని.. ఆమె కున్న ధైర్యం ఏ హీరోయిన్ కి కూడా ఉండదని మీనా తెలిపారు. టైం కి షూటింగ్ కంప్లీట్ కాకపోతే.. మరో షూటింగ్ కు వెళ్లేందుకు రోజా గోడదూకి మరీ పారిపోయేవారని చెప్పి షాక్ ఇచ్చారు. కానీ రోజాహీరోయిన్ తోనూ ఎటువంటి గొడవ పెట్టుకోకుండా అందరితో కలిసి మెలిసి ఉండేవారట. ఏది ఏమైనా సుకుమారంగా కనిపించే హీరోయిన్ రోజా గోడదూకి పారిపోయేవారా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల దృశ్యం, దృశ్యం2 సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న మీనా ప్రస్తుతం అన్నాట్టే అనే ఒక కోలీవుడ్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. వెంకటేష్ తో కలిసి దృశ్యం 2 తెలుగు రీమేక్ సినిమాలో నటించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: