పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ 27వ సినిమాగా రూపొందుతున్న హరి హర వీరమల్లు మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ నిన్న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతాన్ని జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

పీరియాడికల్ మూవీ గా పక్కాగా కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు క్రిష్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీస్తున్నారని అంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాక్వలీన్ ఫీర్నాండెజ్ ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ నటి సినిమాని కీలక మలుపు తిప్పే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక నిన్నటి టీజర్ ని బట్టి చూస్తుంటే ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. 

స్వతహాగా వజ్రాల దొంగ అయిన వీరమల్లు, మోసగాళ్ళైన కొందరు ధనికుల నుండి దోచుకుని వాటిని పేదసాదలకు పంచుతూ, అన్యాయాన్ని అధర్మాన్ని అరికడతాడని, అయితే ఆ సమయంలో జరిగిన ఒక ఘటన అనుకోకుండా అతడి జీవితాన్ని మలుపు త్రిప్పుతుందని, అనంతరం ఎదురైన పరిణామాలను వీరమల్లు ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా యొక్క ప్రధాన కథ అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తారని, అలానే ఈ సినిమాలోని తన పాత్ర కోసం పవన్ ప్రత్యేకంగా పలు యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తుంటే 2022 సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమా మంచి సక్సెస్ అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: