ప్రఖ్యాత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో తనయుడైన అల్లరి నరేష్ తొలిసారిగా అల్లరి సినిమా ద్వారా కొన్నేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ద్వారా భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగిన నరేష్ ఆపై కెరీర్ పరంగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ కామెడీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. అనంతరం అక్కడక్కడ కొన్ని సినిమాల్లో మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ లో కూడా నటించి తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న నరేష్, రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో రవి అనే పాత్రలో తన నటన తో అందరి నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

ఇక ఇటీవల నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి కెరీర్ పరంగా కొన్నేళ్ల నుండి సరైన హిట్ లేక సతమతమవుతున్న నరేష్ కి భారీ బ్రేక్ ను అందించింది అనే చెప్పాలి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ రివెంజ్ డ్రామా మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, ప్రవీణ్, హరీష్ ఉత్తమన్, శంకరాభరణం రాజ్యలక్ష్మి తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో బండి సూర్యప్రకాష్ అనే యువకుడి పాత్రలో అల్లరి నరేష్ నటనకు థియేటర్స్ లో ప్రేక్షకులు జేజేలు పలికారు. ఆ విధంగా ఆడియన్స్ నుంచి గొప్ప పేరు దక్కించుకున్న నరేష్ కి ప్రస్తుతం వరుసగా అవకాశాలు మళ్లీ క్యూ కట్టినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆయన చేతిలో అరడజను పైగా సినిమా అవకాశాలు ఉన్నాయని త్వరలో వాటికి సంబంధించి అధికారిక న్యూస్ బయటకు రానుందని చెబుతున్నారు. అలానే మరి కొందరు దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం/ మొత్తంగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల నాంది తో సూపర్ హిట్ అందుకున్న అల్లరి నరేష్ మళ్లీ సూపర్ ఫామ్ లోకి రావటం ఎంతో ఆనందించదగ్గ విషయమని పలువురు ఆయన అభిమానులు, ప్రేక్షకులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయ పడుతూ కామెంట్స్ చేస్తున్నారు...... !!


మరింత సమాచారం తెలుసుకోండి: