ఇంటర్నెట్ డెస్క్: హీరోయిన్లు ఎంత స్లిమ్‌గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు డైట్ పాటిస్తూ.. బాడీ షేప్‌ను కాపాడుకుంటుంటేనే వారికి అవకాశాలు వస్తాయి. ఏ మాత్రం బాడీ షేప్ మారినా వారి అవకాశాలకు గండిపడతాయి. కొంతమంది కథానాయికలుగా మారడానికి ముందు లావుగా.. షేప్‌లెస్ బాడీతో ఉన్నప్పటికీ.. హీరోయిన్లుగా మారడం కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తారు. తాజాగా అలాంటి ఓ హీరోయిన్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తే ‘నిజంగా ఈమె ఆ హీరోయినేనా..?’ అని ఆశ్చర్యపోకడం ఖాయం.
ఆ
హీరోయిన్ ఎవరో కాదు కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోల సరసన నటించి కొద్ది సినిమాలకే స్టార్
హీరోయిన్ హోదా కొట్టేసిన తెలుగు నటి సమీరా రెడ్డి. టాలీవుడ్‌లో చేసింది తక్కువ చిత్రాలే అయినా.. చేసిన చిత్రాలన్నీ స్టార్ హీరోలతోనే చేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది సమీరా రెడ్డి. చిరంజీవితో జై చిరంజీవ, ఎన్టీఆర్‌తో నరసింహుడు,
అశోక్ తదితర చిత్రాలలో సమీరా హీరోయిన్‌గా చేసింది. నరసింహుడు ఆమె తొలి తెలుగు చిత్రం.

కాగా.. ఈ మధ్య కాలంలో సమీరా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అభిమానులతో కొత్త విషయాలను పంచుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తన టీనేజ్‌లోని ఓ ఫోటోని ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ సరైన ఫిజిక్‌తో అదిరిపోయే ఫిగర్‌తో ఉండే సమీరా.. ఈ ఫోటోలో మాత్రం చాలా లావుగా ఉంది.

అసలు ఈ ఫోటోలో ఉంది సమీరాయేనా అనే అనుమానం కలిగేలా ఉంది. ఈ ఫోటోకు సమీరా.. టీనేజ్‌లో తానెలా ఉన్నానో తన పిల్లలకి స్పష్టంగా చూపిస్తున్నానని, ఇతరులు తమను చూసి ఏమంటారనే విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంపై కూడా వారికి అవగాహన కల్పిస్తున్నానని సమీరా చెప్పుకొచ్చింది. అలాగే గతంలో ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా మారినా.. మన మూలాలను మాత్రం మర్చిపోకూడదనే విషయాన్ని మర్చిపోకూడదని క్యాప్షన్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే తెలుగమ్మాయే అయినప్పటికీ మొదట బాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందువల్లే బాలీవుడ్‌పై ఉన్న ఇష్టంతో అక్కడికే వెళ్లిపోయి టాలీవుడ్‌ను పక్కన పెట్టేసింది. చివరకు బాలీవుడ్‌కే చెందిన ప్రముఖ సినీ
నిర్మాత అక్షయ్ వర్దేని ప్రేమించి
పెళ్లి చేసుకుని ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయింది. ప్రస్తుతం నటి సమీరా రెడ్డికి ఒక బాబు, పాప ఉన్నారు.
ప్రస్తుతం సమీరా
రెడ్డి టీనేజ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత నటి సమీరా
రెడ్డి సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది. అయతే
పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన సమీరా.. చివరిగా తెలుగులో
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో
కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది.