‘మత్తు వదలరా’తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ
సింహా కోడూరి. ప్రస్తుతం శ్రీ
సింహా హీరోగా వస్తున్న రెండో చిత్రం తెల్లవారితే గురువారం. ఈ సినిమాకు మణికాంత్ జెల్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాకు రజని కొర్రపాటి,
రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి
కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ
సినిమా ప్రీరిలీజ్
ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు
రాజమౌళి విచ్చేశారు. ఇక ఈ వేడుకలో
ఎన్టీఆర్ మాట్లాడుతూ... ‘జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను. మీరు (అభిమానులు) అరిస్తే ఎనర్జీ వస్తుంది. ఇలా చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడుతుంటాను.. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు
సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు
సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను. రేపొద్దున భార్గవ్, అభయ్‌ను చూసి కూడా ఎంతో సంబరపడతానేమో.
నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి
శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం
కీరవాణి,
జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు.
నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది.
నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి,
సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం.
సినిమా సక్సెస్ అవ్వాలి.. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ
మూవీ దొహదపడాలి. ఈ
మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి
సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి.. పిల్లలను ఎలా మంచిగా పెంచాలని ప్రణీత, నేను రోజూ అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరూ (సింహా, భైరవ) ఇంత
సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతీ కొడుకు
సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది.. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకోవడానికి వీళ్లున్నారు.
సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్.
సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అంటూ వ్యాఖ్యానించారు.