భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్పగా చెప్పుకునే అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి. ప్రస్తుతం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ అవార్డు తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు దక్కడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాల తన సినీ జీవితంలో తనతో పాటు తోడుగా సాగిన వారందరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లు తలైవా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

సినిమారంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ,ప్రకాశ్‌ జావడేకర్‌, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించి నా వెనుక ఉండి నన్ను నడిపించిన బస్సు డ్రైవర్, నా స్నేహితుడు రాజ్‌ బహదూర్‌, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌, అలాగే ఈ రజనీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు,నాకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ఎంతో మంది దర్శక నిర్మాతలకు, ప్రేక్షకాభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

భారతదేశ ప్రభుత్వం రజనీకాంత్ కి ఈ అత్యున్నతమైన పురస్కారాన్ని అందించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పలువురు పార్టీ నాయకులకు, సినీ ప్రముఖులకు రజినీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సినిమా రంగంలో ఈ పురస్కారాన్ని 50 మందికి అందించారు. ప్రస్తుతం రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. చివరిగా 50వ అవార్డును బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ అందుకున్నారు.హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఈ అత్యున్నతమైన పురస్కారాన్ని 32మంది అందుకోవడం ఎంతో విశేషం. ప్రస్తుతం 51వ పురస్కారాన్ని తలైవా రజనీకాంత్ అందుకోవడంతో ఎంతోమంది రజనీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారుభారత చలన చిత్ర పరిశ్రమలో విశేషంగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనని వరించడం పై సూపర్ స్టార్ రజినీకాంత్  ఆనందం వ్యక్తం చేశారు






మరింత సమాచారం తెలుసుకోండి: