బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్న కరోనా సెకండ్ వేవ్. కరోనా గత కొద్ది రోజుల ముందు వరకు తగ్గినట్టు కనిపించినా మళ్లీ పలు ప్రాంతాల్లో తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది కరోనా. ఇప్పుడు దీని ప్రభావం హిందీ సినీ పరిశ్రమ పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సారి సినిమా రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశాక అనుకున్న సమయానికి విడుదల చేయకపోతే ..ఆ చిత్ర యూనిట్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులే బాలీవుడ్ నిర్మాతలు ఎదుర్కోబోతున్నారు అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఓ వైపు కరోనా మహమ్మారీ ఉత్తరాదిన మెట్రో నగరాల్లో మళ్లీ తన ఉగ్ర రూపాన్ని దాల్చడంతో కేసులు రోజురోజుకు  విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు సిద్ధం చేసుకున్న పలు సినిమాల నిర్మాతలు డైలమాలో పడ్డారు. ఓ వైపు పూణే లాంటి చోట రాత్రి సమయాల్లో ప్రత్యేక ఆంక్షల్ని విధిస్తున్నారు. ఎక్కడికక్కడ అన్నింటినీ మళ్లీ బంద్ చేస్తారు అనే వార్త సినీ ఇండస్ట్రీని  కలవరపెడుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్  సినిమాల విడుదలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఉత్తరాదిన రిలీజ్ చేయాలనుకున్న తెలుగు సినిమాలు సైతం తిరిగి బ్యాక్ టు మదర్ ఇండస్ట్రీ అని వచ్చేస్తున్నాయి.

ఇక అక్కడి లోకల్ సినిమాలు కూడా వాయిదా పడుతున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్- రోహిత్ శెట్టి కాంబినేషన్ లో చేసిన మూవీ `సూర్యవంశీ` చిత్రాన్ని విడుదల చేయడానికి ధైర్యం చేసి ఏప్రిల్ 30 న విడుదల తేదీగా బ్లాక్ చేశారట. ఇలా పలు సినిమాల విడుదల తేదీలలో మేకర్స్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ముగించుకున్న సినిమాల గురించి చివరకి ఏం డిసైడ్ అవ్వనున్నారో అనే విషయం తెలియాల్సి ఉంది. పైగా అంతా సర్దుమణిగింది మళ్ళీ సినిమా ఇండస్ట్రీ కళలాడుతోంది అన్న సంతోష సమయంలో మళ్ళీ ప్రతికూల పరిస్థితులు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తాయని తెలుస్తోంది. అతి త్వరలోనే పరిస్థితి కుదుటపడాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: