మెగాస్టార్ చిరంజీవి తన 153వ సినిమా ‘లూసిఫర్’ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా షూటింగ్ నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు సినిమా షూటింగ్ పనులు నిలిపివేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి దశకు చేరుకుంది. ఆచార్య సినిమాను కూడా రిలీజ్ చేయకపోవడంతో ఈ ఎఫెక్ట్ లూసిఫర్ మీద పడింది. వాస్తవానికి లూసిఫర్ సినిమా క్యాస్టింగ్‌ను ఎప్పుడో ఫైనల్ చేశారు. మార్చి రెండవ వారం నుంచే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ షెడ్యూల్ వేసుకున్నారు. ఆ షెడ్యూల్‌కు తగ్గట్లుగానే నటీనటులను కూడా ఎంపిక చేశారు.

 

మలయాళ సూపర్‌హిట్ మూవీ అయిన ‘లూసిఫర్’ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ అనుకోకుండా ఆగడంతో.. షూటింగ్‌ను పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దర్శకుడు మోహన్ రాజా మాత్రం ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొన్ని లొకేషన్లలో షూట్స్ తీసే ప్లాన్‌లో ఉన్నాడట. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా లూసిఫర్ సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 


మలయాళం లూసిఫర్ సినిమా నుంచి కేవలం స్టోరీ లైన్ తీసుకున్నట్లు చెప్పారు. ఇది ఒరిజినల్ రీమేక్ కాదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాను లక్ష్మీభూపాల్ డైలాగులు రాస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సిన

మరోపక్క ‘ఆచార్య’ సినిమా ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘లాహే లాహే’ బాగా క్లిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: