సినిమా రంగంలో కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్ ఏది అయినా ఒకే కీల‌క సీజ‌న్లో ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్లలోకి వ‌స్తున్నాయంటే ఎలాంటి ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగులో ఒకే సారి బాల‌య్య - చిరంజీవి సినిమాలు వ‌స్తున్నాయంటే బాక్సాఫీస్ యుద్ధం మామూలుగా ఉండ‌దు. అలాగే తెలుగులో ఏ ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు పండ‌గ సీజ‌న్లో ఒకే సారి రిలీజ్ అయినా ఆ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య పెద్ద అప్ర‌క‌టిత యుద్ధ‌మే ఉంటుంది. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి కూడా మామూలుగా ఉండ‌దు.

ఈ క్ర‌మంలోనే కోలీవుడ్‌లో అగ్ర క‌థానాయ‌కులు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ పోటీ ప‌డుతున్నారు. త‌మిళ చిత్ర సీమ‌పై నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా త‌మ‌దైన ముద్ర వేసుకున్న ఈ ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ్ అవ్వ‌డం అంటే మామూలు క్రేజ్ ఉండ‌ద‌నే చెప్పాలి. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న అణ్ణాత్త సినిమా విడుద‌ల‌వుతున్న‌ట్లు నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే క‌మ‌ల్ - కోలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న విక్ర‌మ్ సినిమా కూడా దీపావ‌ళి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు వార్త‌లు కోలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంటే 16 ఏళ్ల త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద వీరిద్ద‌రు పోటీ ప‌డుతున్నారు. 2005లో ర‌జినీకాంత్ చంద్ర‌ముఖి.. క‌మ‌ల్‌హాస‌న్ ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాల‌తో పోటీ ప‌డితే, ర‌జినీకాంత్..‘చంద్ర‌ముఖి’ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కాగా.. క‌మ‌ల్‌హాసన్ ‘ముంబై ఎక్స్‌ప్రెస్’ డిజాస్ట‌ర్ అయ్యింది. మరి ఈసారి దీపావళి విన్నర్ ఎవరవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: