సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 1. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాని మిగతా ఇతర భారతీయ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ తర్వాత అన్ని భాషల్లో కూడా భారీ సక్సెస్ అందుకున్న కే జి ఎఫ్ చాప్టర్ 1 పలు భాషల్లో సంచలన రికార్డులు కూడా నమోదు చేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సినిమానే కే జి ఎఫ్ చాప్టర్ 2. మొదటి భాగాన్ని మించే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మరింత అద్భుతంగా భారీ ప్రతిష్టాత్మక విలువలతో చాప్టర్ 2 ని గ్రాండ్ లెవల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలె ఫిలింస్ వారు అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే నెగటివ్ పాత్ర చేస్తుండగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ రమిక సేన్ అనే రోల్ చేస్తున్నారు.

రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు తదితర నటులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇటీవల పూర్తి చేసుకుంది. కాగా సినిమాని జూలై 16 న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తామంటూ ఇటీవల కే జి ఎఫ్ చాప్టర్ 2 యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఇక కొన్నాళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క టీజర్ కి ప్రేక్షకాభిమానులు నుండి మంచి స్పందన రావడంతో పాటు అది సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా క్రియేట్ చేసింది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మనదేశంలో ఉదృతంగా ఉండటంతో ఒకదాని వెంట మరొకటి సినిమాలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.

అలానే కే జి ఎఫ్ చాప్టర్ 2 ని కూడా మరి కొన్నాళ్లపాటు వేయాలని యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. అయితే సినిమా విడుదలకి మరొక రెండు నెలల సమయం మిగిలి ఉన్నపటికీ విడుదల సమయానికి పరిస్థితులు పూర్తిగా చక్క పడే అవకాశం కనపడడం లేదని, అందుకే తమ సినిమాని ఏ డేట్ న రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో కే జి ఎఫ్ చాప్టర్ 2 యూనిట్ ఉందని అంటున్నారు. మరి ఈ మూవీ నిజంగానే వాయిదా పడుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలంటే స్వయంగా యూనిట్ నుంచి దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ బయటకు రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: