టాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ గా పేరు గాంచింది  వైజయంతీ మూవీస్..గతంలో అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి నంబర్ వన్ ప్రొడక్షన్ హౌజ్ గా ఎన్నో లాభాలను అందుకుంది.. ఇదిలా ఉంటె వైజయంతీ మూవీస్ సంస్థకు, దాని అధినేత సి.అశ్వనీదత్ కు మే9 మర్చిపోలేని రోజు. ఈ సంస్థ నిర్మించిన పలు చిత్రాలు ఈ తేదీన విడుదలై ప్రేక్షకులను అలరించాయి. మే 9, 1990లో విడుదలైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం చరిత్ర సృష్టించింది. చిరంజీవి, శ్రీదేవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్‌ ద బిగ్ హిట్ అని చెప్పవచ్చు.ఇక మే 9, 2008లో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన 'కంత్రీ' సినిమా...

 భారీ అంచనాలతో విడుదలై అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే ఓ నటుడికి సంబంధించి 3డి యానిమేటెడ్ క్యారక్టర్ తో వచ్చిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది.ఆ తర్వాత మే9, 2019లో మహేశ్ బాబు హీరో వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ తో కలసి వైజయంతీమూవీస్ సంస్థ నిర్మించిన 'మహర్షి' విడుదలైంది. సూపర్ హిట్ అయిన ఈ సినిమా జాతీయ అవార్డుల్లో హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా అవార్డు అందుకోవడంతో పాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ కూడా గెలుచుకుంది.ఇక వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మించిన 'మహానటి' మే 9, 2018లో రిలీజ్ అయింది.

 ఈ సినిమాకు 66వ జాతీయ అవార్డుల్లో మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డులతో పాటు టైటిల్ పాత్ర పోషించిన కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అంతే కాదు 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన పనోరమా విభాగంలో మెయిన్ స్ట్రీమ్ కు ఎంపికైంది. షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శితం అయింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో 'ఈక్వాలిటీ ఇన్ సినిమా' అవార్డ్ గెలుచుకుంది. ఫిలిమ్ ఫేర్, సైమా అవార్డ్ లతో పాటు నార్వే తమిళ్ ఫిలిమ్ ఫెస్టివల్ లో కీర్తి కి స్పెషల్ జ్యూరీ అవార్డ్ కూడా లభించింది. ఇలా మే 9 వైజయంతీ సంస్థకు ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: