టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య, మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ఎల్లప్పుడూ పోటీ ఉంటుంది. టాప్ ర్యాంక్ పొందేందుకు ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉంటారు. ఇక టాలీవుడ్‌లోనూ ఇలాంటి పోటీ ప్రతి క్షణం ఉంటుంది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ నెలకొంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు దేవీశ్రీ ప్రసాద్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో థమన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో దేవిశ్రీ ప్రసాద్ - థమన్ మధ్యలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఒకానొక సమయంలో ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ ఉందని తమన్ కూడా ఒప్పుకున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ థమన్ ఇద్దరూ  కూడా మణిశర్మ స్కూల్ నుంచే మ్యూజిక్ నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే థమన్ చాలాసార్లు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై ప్రశంసలు కురిపించించాడు. కానీ దేవి మాత్రం థమన్ మ్యూజిక్‌పై ఇప్పటివరకు ఎక్కువగా స్పందించలేదు. గత నాలుగైదేళ్లుగా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వరుస హిట్లతో పోటాపోటీగా ముందుకెళుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో దేవీశ్రీ రేంజ్ కొంత తగ్గింది. అప్పట్లో అతడితో క్లోజ్‌గా ఉన్న డైరెక్టర్లు కూడా ఇప్పుడు థమన్‌వైపు వెళ్లిపోతున్నారు. హీరోలు కూడా థమన్‌ మ్యూజిక్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

ఇక రెమ్యునరేషన్ విషయంలో మొదటిసారి అందరికంటే ఎక్కువ తీసుకుంటూ వస్తున్నాడు. థమన్ కూడా మెల్లగా డోస్ పెంచుతున్నాడు.  హిట్టు అనంతరం ఒక్కసారిగా పారితోషికాన్ని డబుల్ చేసినట్లు టాక్ వచ్చింది.

ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ అందరికంటే ఎక్కువగా ఓ సినిమాకు 4కోట్లకు‌పైగా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇక థమన్ కూడా అల.. వైకుంఠపురములో హిట్ తరువత నెమ్మదిగా డోస్ పెంచుతున్నాడు. దాంతో పాటు వరుసగా క్రాక్, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో మ్యూజికల్‌గా కూడా హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలోనే థమన్.. ఇప్పుడు రూ.3కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. కాగా.. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప, ఖిలాడి, రామ్ పోతినేని 19వ సినిమా, PSPK28, f3, వంటి విభిన్నమైన సినిమాలకు మ్యూజిక్ అందించబోతున్నాడు. అలాగే థమన్ చేతిలో అక్కినేని తదుపరి సినిమా ఏజెంట్, సర్కారు వారి పాట, టక్ జగదీష్, అఖండ వంటి సినిమాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: