తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఆ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఎవ‌రికి లేదు.మాస్ అయిన క్లాస్ అయినా పౌరాణిక చిత్రాల్లో న‌టించాల‌న్న ఆయ‌న‌కు ఎవ‌రు పోటీ రారు.చిన్న‌వ‌య‌సులోనే కోట్ల మంది అభిమానుల‌ను సంపాదించుకున్నఆ హీరో ఎవ‌రో కాదు....యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌(జూనియ‌ర్ ఎన్టీఆర్‌).అయితే ప్ర‌తి ఏ హీరో పుట్టిన రోజునాడైన త‌మ‌ అభిమానులు చాలా మంది సేవా కార్య‌క్ర‌మాలు చేస్తారు.కానీ తార‌క్ అభిమానులు మాత్రం అలా కాదు.నిత్యం ఏదో ఒక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూనే ఉంటారు.అదే ఆయ‌న అభిమానుల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త‌.

టీమ్ తార‌క్ ట్ర‌స్ట్‌..ఇప్పుడు ఈ పేరు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తార‌క్ అభిమానులంతా ఒక టీమ్‌గా ఏర్ప‌డి 2019లో టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ ని ఏర్పాటు చేశారు.అయితే అంత‌కు ముందు కూడా వీరంతా తార‌క్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ప్ప‌టికీ అంద‌రిని ఒకే వేదిక‌పై తీసుకొచ్చేందుకు టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ గా పేరు పెట్టారు.దీనికి ఎన్టీఆర్ వీరాభిమానులు యార్ల‌గ‌డ్డ మనోజ్‌, అజ‌య్‌,విక్ర‌మ్‌లు ఫౌండ‌ర్‌లుగా ఉన్నారు.వీరితో పాటు మ‌రో 30 మంది వివిధ జిల్లాల నుంచి స‌భ్యులుగా ఉన్నారు.వీరంతా తార‌క్ అభిమానులుగా త‌మ తోటి అభిమానుల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌ల‌కు ఏ ఆప‌ద వ‌చ్చిన ముందు
నిలుస్తున్నారు.అన్న‌దానం, ర‌క్త‌దానం,నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు పంపిణీ,పేద పిల్ల‌ల‌కు చ‌దువుకు అవ‌స‌ర‌మైయ్యే పుస్త‌కాలు,యూనిఫాం,మొక్క‌లు నాట‌డం లాంటి కార్య‌క్ర‌మాలు టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ స‌భ్యులు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=TytRDDn0Xn4

క‌రోన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పేద ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంలో తార‌క్ అభిమానులు ముందు వ‌రుస‌లో ఉన్నారు.గ‌త ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది వ‌ల‌స కూలీలు, పేద‌లు ఆక‌లికి అల‌మ‌టించారు.వీరిని ఆదుకునేందుకు తార‌క్ అభిమానులు న‌డుంబిగించారు.లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయి ఇళ్లుగ‌డ‌వ‌ని వారికి త‌మ వంతు సాయంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను అందించారు.ప్ర‌స్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న త‌రుణంలోనూ సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆప‌లేదు.క‌రోన బారిన‌ప‌డి భోజ‌నానికి ఇబ్బందిప‌డుతున్న వారికి టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ స‌భ్యులు స్వ‌యంగా వారికి భోజ‌నాల‌ను అందిస్తున్నారు. అంతే కాదు 400 రోజులుగా ప్ర‌తి రోజు వంద‌ల మంది నిరాశ్ర‌యుల‌కు,పేద‌వారికి భోజ‌నం పెడుతున్నారు.ఇవే కాక విక‌లాంగులు, అనాథ‌శ్ర‌మం,వృద్ధాశ్ర‌మాల్లో ఆయా స‌భ్యుల పుట్టిన‌రోజున వేడుక‌ల‌ను జ‌రుపుకుంటూ వారికి భోజ‌నం పెడుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వారు ఎక్క‌డున్నవారికి స‌హాయం అందిస్తున్నారు తార‌క్ అభిమానులు,బెంగుళూర్‌,చెన్నై,పుదుచ్చేరి లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్లు త‌మ సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు.
తార‌క్ అభిమానులు కేవ‌లం అన్న‌దానం,నిత్య‌వ‌స వ‌స్తువులు పంపిణీ చేయ‌డ‌మే కాదు...ర‌క్త‌దానం కూడా చేస్తున్నారు.అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ్ల‌డ్ కావాల్సిన వారికి త‌మ స‌భ్యుల‌తో పాటు తార‌క్ అభిమానులు వారికి బ్ల‌డ్ డోనేట్ చేస్తున్నారు. వీటితో పాటు అనేక సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.అయితే ఈ సేవా కార్య‌క్ర‌మాల‌కు ఎక్క‌డ ఆర్థికసాయం తీసుకోవ‌డంలేదు.తార‌క్ అభిమానులు త‌మ సొంత డ‌బ్బుల‌తోనే ఈ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.


న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేయ‌ను - జూ.ఎన్టీఆర్‌

త‌న పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ స‌భ్యుల్ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అభినందించారు.తాను అభిమానుల‌కు చేసే దానికంటే అభిమానులే త‌న‌కు చేస్తుంది ఎక్కువ‌న్నారు.తాను ఏ రోజు ఇలా చేయండి అని చెప్ప‌లేద‌ని...అభిమానులే స్వ‌యంగా ముందుకు వ‌చ్చి ఇలాంటి మ‌హోన్న‌త‌ కార్య‌క్ర‌మాలు చేయ‌డం సంతోషంగా ఉందన్నారు.త‌న అభిమానులు ఎప్పుడూ కాల‌ర్ ఎగ‌రేసుక‌ని తిరిగేలా చేస్తాన‌ని...న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేయ‌నంటూ తెలిపారు.
https://www.youtube.com/watch?v=SyTRoU1X4m8

టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ స‌భ్యులు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప‌లువురు సిని, రాజ‌కీయ నాయకులు అభినందించారు.శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌,న‌టుడు కృష్ణుడు,విజ‌య‌వాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌,సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ త‌మ‌న్‌,ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ మూర్తి,మాజీ టీటీడీ బోర్డ్ ఛైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌లు వీరంద‌రిని అభినందించారు.టీమ్ తార‌క్ ట్ర‌స్ట్ స‌భ్యుల‌కు అండ‌గా న‌టులు రాజీవ్ క‌న‌కాల‌, చ‌ల‌ప‌తిరావులు నిలుస్తారు. స‌భ్యులు చేసే ప్ర‌తి కార్యక్ర‌మానికి భ‌రోసా ఇస్తున్నారు.
https://www.youtube.com/watch?v=fvdIwltk6og

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇలాంటి అభిమానుల‌ను సంపాదించుకోవ‌డం ఆయ‌న‌కు మ‌ర‌చిపోలేనిది.ఎందుకంటే ఏ ఒక్క‌రూపాయి ఎవ‌రి ద‌గ్గ‌ర నుంచి ఆశించ‌కుండా త‌మ సొంత డ‌బ్బుల‌తో వేల మందికి ఆక‌లి తీర్చ‌డం అనేది చాలా క‌ష్టం.కానీ వీరు మాత్రం త‌మ సొంతంగానే అడిగిన వారికి కాద‌నకుండా త‌మవంతు సాయం చేస్తున్నారు.హ్యాట్సాఫ్  టీమ్ తార‌క్ ట్ర‌స్ట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: