గత కొంతకాలంగా అల్లు అర్జున్ సినిమాలు అనేక రికార్డులను నెలకొల్పుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ వేదికగా అల్లు అర్జున్ సినిమాలు చెక్కుచెదరని రికార్డులు నమోదు చేస్తున్నాయి. రుద్రమదేవి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు వంటి హిందీ వర్షన్ సినిమాలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఇక అల వైకుంఠపురములో మూవీ పాటలు 300 మిలియన్లకు పైగా వీక్షణలు సంపాదించి అల్లు అర్జున్ఖాతాలో కళ్లు చెదిరే రికార్డులు నమోదు చేశాయి.



పుష్పరాజ్ ఇంట్రో వీడియోకి ఏడు కోట్ల వ్యూస్, పదిహేను లక్షల లైకులు రావడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అఖండ మూవీ టీజర్ శరవేగంగా 50 మిలియన్ల వ్యూస్ సంపాదించింది కానీ ఆ తర్వాత కేవలం 4 మిలియన్లు మాత్రమే సంపాదించింది. కానీ పుష్పరాజ్ ఇంట్రో మాత్రం 10 కోట్లు వ్యూస్ సంపాదించే దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే బన్నీ పాత సినిమా ఒక అరుదైన రికార్డును నెలకొల్పి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.



అదేంటంటే.. 2017లో హరీష్ శంకర్, బన్నీ కాంబో లో వచ్చిన డీజే: దువ్వాడ జగన్నాథం మూవీ హిందీ వర్షన్ యూట్యూబ్ లో 350 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంటే 35 కోట్ల వ్యూస్ పొందిందన్నమాట. రెండు సంవత్సరాల లోనే ఈ స్థాయిలో వ్యూస్ సంపాదించిందంటే మరి కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ వ్యూస్ సంపాదించినా ఆశ్చర్య పడనక్కరలేదు. అయితే ఈ సినిమా 16 లక్షల లైక్స్ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మరో విశేషం. సాధారణంగా నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వీడియోలకు ఈ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. అయితే టాలీవుడ్ హీరో అయిన అల్లు అర్జున్ వీడియోస్ ఇంటర్నేషనల్ స్టార్లకు సరి సమానంగా వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. ఆయన నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ 61 కోట్ల వ్యూస్ సంపాదించింది. ఒక తెలుగు సినిమా పాట 1 బిలియన్ వ్యూస్ చేరువలో ఉండటం నిజంగా చెప్పుకోదగిన విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: