మన సినిమా నటుల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వారి వ్యక్తిగత జీవితం యొక్క విశేషాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారి ఆసక్తికి తగ్గట్లే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎన్నో మలుపులతో మరెన్నో ట్విస్ట్ ల తో కూడుకొని ఉంటాయి. హలో సూపర్ స్టార్ కృష్ణ జీవితం ఎన్నో మలుపులు మయం మరెన్నో ట్విస్ట్ ల సమాహారం.. ఆయన సినీ జీవితం ఎంత గొప్పగా ఉందో ఇప్పటికే పలుమార్లు ఆయన సినిమాల ద్వారా తెలుసుకున్నాం. తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ ను సృష్టించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ.

ఎన్నో పాత్రలు ఆయన చూసి పుట్టుకొచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో ఎన్నో పాత్రలకు ఆది గురువు ఆయన. ఆ తర్వాత ఆ పాత్రలో తను తప్ప వేరే ఎవరూ నటించలేరు అన్న రీతిలో నటించి గొప్ప కథా నాయకుడు అయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ రెండు వివాహాలు చేసుకున్నారు. 1961లో ఇందిరాదేవి తో ఆయన మొదటి వివాహం జరుపుకోగా, ఆ తర్వాత హీరోయిన్ విజయనిర్మల తో ప్రేమలో పడి 1969లో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. విజయనిర్మల పెళ్లి చేసుకునే సమయానికి సూపర్ స్టార్ కృష్ణకు ఐదుగురు వారసులు కలగగా విజయనిర్మలకు కూడా ఒక పుత్రుడు ఉన్నాడు.

అయినా ఇవేవి వారి ప్రేమకు అడ్డు రాలేదు. కృష్ణా రెండో వివాహం తర్వాత ఇందిరా దేవి పరిస్థితి ఎలా ఉండేది? ఇందిరాదేవి ఎలా ఫీల్ అయ్యారు? అనే విషయం తెలుసుకోవడానికి ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇవి పక్కన పెడితే ఇందిరాదేవి ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయనతోపాటు సందడి చేశారు. ఆయన పుట్టిన రోజు వేడుకల వీడియోలో ఆమె కనిపించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆనందపరిచారు. ఇటీవలే విజయనిర్మల పరమపదించగా ఆమె స్థానాన్ని ఇందిరాదేవి భర్తీ చేసిందని చెప్పొచ్చు. తోడు లేక ఒంటరిగా మిగిలిపోయిన కృష్ణ కు తోడు ఇస్తూ ఆయనకు భార్య లేని లోటును తీరుస్తున్నారు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: