ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ట్రెండ్ మారింది. కరోనా కాలంలో లాక్ డౌన్ విధించడంతో థియేటర్లో క్లోజ్ అవడంతో తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ సంస్థలకు తమ సినిమా లను అమ్ముకుంటున్నారు. అలా గత రెండు సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాలు  సైతం ఈ సంస్థలకు అమ్ముడవుతున్నాయి. హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా అన్ని సినిమాలు ఓటీటీలలో విడుదల అవుతూ ఉండగా భవిష్యత్తులో మరికొన్ని సినిమాలు కూడా ఈ విధంగానే విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

సినిమాలను చూసి కొన్ని కొన్ని వెబ్ సిరీస్ లు కూడా OTT లలో విడుదల అవ్వడానికి రూపొందించబడుతున్నాయి. అలా తెలుగులో ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లు నిర్మితమై రిలీజ్ కాగా వాటి ద్వారా కొంత మంది నటీనటులు ఫేమస్ అయ్యారు కూడా. వారు ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు పొందుతూ ఉన్నారు.  అలా వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయినా హీరోయిన్ లను చూద్దాం.

సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న హీరోయిన్ మౌనిక రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు దక్కించుకుని సినిమా అవకాశాలు అందుకుంటుంది.  హౌ ఐ మెట్ పారు అనే వెబ్ సిరీస్ ద్వారా శ్రీప్రియ ప్రేక్షకులను ఆకట్టుకోగా, రామ్ లీలా అనే వెబ్ సిరీస్ ద్వారా సిరి హనుమంత్, ఇల్లరికం అల్లుడు అనే వెబ్ సిరీస్ ద్వారా శ్రీ ఝాన్సీ, సాఫ్ట్ వేర్ డెవలపర్ ద్వారా వైష్ణవి చైతన్య,అనసూయ రామలింగం ద్వారా సోనియా సింగ్, గీత సుబ్రహ్మణ్యం దర్శిని శేఖర్, ఫిమేల్ ఫ్లాట్ మెట్ విరాజిత, 30 వెడ్స్ 21 అనన్య, బ్యాక్ బెంచర్స్ వర్ష డిసౌజా, నిన్ను కోరి స్రవంతి ఆనంద్, ఏవండోయ్ ఓనర్ గారు అలేఖ్య హారిక, లవ్ స్టోరీ దివ్యశ్రీ వంటి వారు మంచి పాపులారిటీని వెబ్ సిరీస్ ల ద్వారా అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: