హీరోలు మాత్రమే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లు పాత్రలు చేస్తున్న రోజులవి. హీరోయిన్ లు కేవలం గ్లామర్ పాత్రలకే  పరిమితం, పాటలు మాత్రమే చేయాలి అని అనుకుంటున్న ఆ సమయంలో ఒక హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం.. అది హిట్టవడం.. ప్రేక్షకులనే కాదు సినిమా వారిని కూడా ఎంతో ఆశ్చర్యపరిచింది. అందులో నూ విజయశాంతి లాంటి మంచి నటి పోలీ స్ ఆఫీసర్ గా చేసి  హిట్ కొట్టడం అందరికీ సంతోషాన్ని కలిగించింది. 

1990 లో ఎ మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం కర్తవ్యం. విజయశాంతి వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఓ నిజాయితీగల పోలీస్ అధికారిణి అంగ బలం, అర్ద బలం కలిగిన అవినీతిపరులను రౌడీలను ఎలా ఎదుర్కున్నది అన్నది ఈ చిత్ర కథాంశం. వైజయంతి గా విజయశాంతి కనబరిచిన నటనకు హీరోలు సైతం ముగ్ధులయ్యారు. అప్పట్నుంచే ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ప్రారంభించింది విజయశాంతి.

హీరోలకు సమానంగా తన మార్కెట్ ను ఈ సినిమాతో పెంచుకుంది విజయశాంతి. ఏమైనా పోలీస్ నేపథ్యమున్న సినిమాలలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు రాగా కర్తవ్యం ఆ సినిమాలలో ముందువరుసలో ఉంటుంది అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత ఈ తరహా సినిమాలు విజయశాంతి చాలా చేయగా వాటన్నిటి కంటే ఎక్కువగా కర్తవ్యం సినిమా ద్వారానే ఆమెకు మంచి పేరు వచ్చింది. దాదాపు 90 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఏకంగా 7 కోట్ల కలెక్షన్లను సాధించింది. విజయశాంతిసినిమా ద్వారా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. తమిళ, హిందీ భాషల్లో కి కూడా డబ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: