తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాఘవేంద్రరావు కి ఓ చరిత్ర ఉంది. దర్శకుడిగా వంద చిత్రాలకుపైగా చేసిన రాఘవేంద్ర రావు ఎంతో మంది హీరోలు ఎన్నో గొప్ప గొప్ప హిట్లు అందించారు. ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు కూడా పరిచయం చేసిన ఘనత ఆయనది. ఆయనలోని సౌమ్యమైన గుణాన్ని ప్రతి ఒక్కరు ఎంతగానో ఇష్టపడతారు. వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తి రాఘవేంద్రరావు. అలాంటి రాఘవేంద్రరావు కు నటి సిల్క్ స్మిత తో గొడవ అయింది అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.

ఐటమ్ సాంగులతో బాగా పాపులర్ అయి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సిల్క్ స్మిత ఎందుకు రాఘవేంద్రరావు తో గొడవ పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొండవీటి రాజా సినిమా లో సిల్క్ స్మిత తో పాటను చిత్రీకరించాలి అనుకున్నారు రాఘవేంద్రరావు. అందుకు ఆమె డేట్స్ కూడా తీసుకున్నారు. స్మిత సెట్లోకి అడుగు పెట్టగానే దర్శకుడు రాఘవేంద్రరావు ఆమె వంక పరిశీలనగా చూశాడు. అప్పుడే నిద్ర లేచి తల కూడా దువ్వుకోకుండా చింపిరి జుట్టుతో సెట్ లోకి వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి  రాఘవేంద్రరావు జుట్టు సరి చేసుకోమని చెప్పాడు. రాఘవేంద్ర రావు కి సెట్ లో ఏదైనా చెప్తే అది జరగాల్సిందే. అలాంటిది సిల్క్ స్మిత  ఆయన సలహా పాటించడం లేదు సరికదా తన హెయిర్ స్టైల్ బాగానే ఉందని ఆయనతో వాదించారు.

రాఘవేంద్రరావు సరే అని షాట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ రోజు మొత్తం చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది అయితే ఈ సినిమాలో కొంత భాగాన్ని పొగమంచు వాతావరణంలో తీయాలి అనుకున్నారు కానీ స్మిత పొగ పోయేలా ఫ్యాన్ వేసుకొని కూర్చోవడంతో షూటింగ్ కు అంతరాయం కలిగింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ దేవీ వర ప్రసాద్ కి స్మిత ప్రవర్తన అస్సలు నచ్చలేదు. రెండో రోజు కూడా స్మిత ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఆమె ప్రవర్తన కు కోపం వచ్చిన దేవి వరప్రసాద్ రాఘవేంద్రరావు తో మాట్లాడి తక్షణమే ఆ సినిమా నుంచి తొలగించేలా చేశారు. అప్పటికే రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. అయితే ఆ పాటలో ఇంకా పల్లవి ఇంకో కారణం మిగిలి ఉన్నాయి. అయితే ఒక చరణాన్ని జయమాలిని తో, ఇంకో చరణం అనురాధ తో చేసి  పాట పూర్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: