పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన సినిమా “ఓజి”. దర్శకుడు సుజీత్ పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే రికార్డ్ స్థాయి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ప్రీమియర్స్ నుంచి వీకెండ్ వరకు బాక్సాఫీస్ దగ్గర బలమైన హోల్డ్‌ సాధించింది. పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ స్టైలిష్ ట్రీట్మెంట్, థమన్ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ క‌లిసి ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ అయ్యాయి.


వీకెండ్ వరకు ప్రేక్షకులు ఓజీని ప‌దే ప‌దే చూశారు. దీంతో థియేటర్లు ఫుల్స్ అయ్యాయి. అభిమానుల పవన్‌పై ఉన్న మాస్ స్టామినా కారణంగా టికెట్ రేట్స్ పెద్ద సమస్య కాలేదు. కానీ అసలు పరీక్ష మాత్రం ఇప్పుడు మొదలవుతుంది. సోమవారం నుండి బాక్సాఫీస్ వద్ద ఓజీ ఎలా పెర్పామ్ చేస్తుంద‌న్న‌దే ముఖ్యం. గత కొన్ని ఏళ్లుగా పవన్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించినా, లాంగ్ రన్‌లో అంత బలంగా నిలవలేదు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కెరీర్‌లో సరైన లాంగ్ రన్ ఇచ్చిన సినిమా ఒక్క‌టీ లేదు.


“ఓజి” మాత్రం ఆ ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉందా లేదా అన్న‌ది ఈ వీక్‌డేస్‌లో తేలిపోనుంది. ఓజీ సినిమాకి ఎలాంటి నెగటివ్ టాక్ రాకపోవడం, ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, మాస్‌కి కనెక్ట్ అయ్యే ఎలివేషన్స్, టిక్కెట్ రేట్లు హైక్ ఇవ‌న్నీ ప్ల‌స్ కానున్నాయి. పైగా, యాక్షన్-ఎంటర్టైన్మెంట్‌తో పాటు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా డిజైన్ చేయబడిన ఈ చిత్రం, పవన్ కెరీర్‌లో మళ్లీ ఒక బ్లాక్‌బస్టర్ రన్ సాధించే అవకాశాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు చూడాల్సింది, “ఓజి” నిజంగానే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ రికార్డ్స్‌ను కొత్త దిశలోకి నడిపిస్తుందా లేదా అన్నది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: