తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఇప్పుడు మూడో వారం కూడా పూర్తి అయింది. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటికి వచ్చేసారు. ఈ మూడో వారం కూడా మొదటినుంచి అందరూ అనుకుంటున్నాట్టుగానే ప్రియా ఎలిమినేట్ అయ్యింది. కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. కాని ఆమె ఎప్పుడు చూసినా కూడా గొడవలకు ప్రాధాన్యత ఇవ్వడం అడ్డగోలుగా వాదించడం వల్ల ప్రేక్షకులకు కొంత చిరాకు తెప్పించింది. టాస్కులలో ప్రియా వ్యవహరించిన తీరు అలాగే సంచలక్ గా ఆమె చేసిన తప్పులు ఎలిమినేషన్ కు ముఖ్య కారణమయ్యాయని చెప్పవచ్చు.



మొదటివారం సెలబ్రిటీ శ్రేష్ఠ వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అవ్వగా, మూడో వారం ఎలిమినేషన్ లిస్టులో.. రీతూ చౌదరి, రాము రాథోడ్, కళ్యాణ్, ప్రియా శెట్టి, హరిత హరీష్ ఉన్నారు.. అయితే ఓటింగ్లో ప్రియా, హరీష్ చివరి స్థానంలో ఉండగా హరీష్ కంటే ప్రియాకు చాలా తక్కువ ఓటు రావడంతో ఈ వారం ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. గతవారం నాగార్జున ఇచ్చిన సలహాతో తన ఆట తీరు మార్చుకున్న ప్రియా, కానీ ఈమెకు అప్పటికే  నెగిటివ్ ఎక్కువగా రావడంతో ఆ ఎఫెక్ట్ ఓటింగ్ మీద పడింది.

అయితే మూడు వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ప్రియా శెట్టికి రెమ్యూనరేషన్ వారానికి రూ.60 వేల రూపాయల వరకు తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రియాకు మూడు వారాలకు గాను రూ. 1,80,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి. సీజన్ 9 లో హౌస్ లోకి కామనర్ గా వెళ్లిన ప్రియా శెట్టి వృత్తిరీత్యా డాక్టర్ చదివింది. అయినా కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాగైనా వెళ్లాలనే పట్టుదలతో వెళ్లిన మూడు వారాలకే ఎలిమినేట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: