మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో తమన్ కూడా ఒకరు . తాజాగా తమన్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ పలువురు ట్రోల్స్ చేస్తున్నారు . ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్  గేమ్ చేంజర్ పాటలకు హుక్ స్టెప్పులు లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేయగా ఆ కామెంట్స్ చర్చనీయాంసంగా మారాయి . ఆయన చేసిన కామెంట్స్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు తమన్ .


" రామ్ చరణ్ పెద్ద డాన్సర్ . తొలి సినిమాతో మొదలు నాయాక్ లోని లైలా ఓ లైలా మరియు బ్రూస్ లీ లోని మెగా మెగా మీటర్ లాంటి ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేసి ఫాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అలాంటి ఆయన ఎనర్జీకి కొరియోగ్రాఫర్లు సరైన మూమెంట్లు ఇవ్వలేకపోయారని నేను భావిస్తున్న  " అంటూ తమన్ కామెంట్స్ చేశాడు . ప్రజెంట్ తమన్ కామెంట్స్ నువ్వు కొందరు హీరోని టార్గెట్ చేసి మాట్లాడాడని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు . గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ డాన్స్ టాలెంట్ను సరిగ్గా వాడుకోలేకపోయాను అన్నది నా బాధ అంతేకానీ వేరే ఉద్దేశంతో నేను అనలేదు .


రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి . అందువలనే ఆయనని నేను మెగా హాట్ స్టార్ అని పిలుస్తాను అని తమన్ వెల్లడించాడు . ప్రజెంట్ తమన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ కామెంట్స్ చూసిన చెర్రీ ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు . ఇక తాజా గానే తమన్ ఓజీ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో తమన్ పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది .



[

మరింత సమాచారం తెలుసుకోండి: