ఫిబ్రవరి 10, 2000 సంవత్సరంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన హ్యాండ్సప్ సినిమాలో కొణిదెల నాగేంద్ర బాబు (నాగబాబు), జయసుధ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. రాఘవ లారెన్స్ చిరంజీవి స్పెషల్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రంలో సోనూసూద్ కూడా నటించడం విశేషం. హ్యాండ్సప్(Hands Up) సినిమాలో నాగబాబు, బ్రహ్మానందం తమ సీనియర్ లేడీస్ పోలీస్ ఆఫీసర్ సరస్వతి పై మనసు పారేసుకుంటారు. వారిద్దరూ ఆమెని ఎంతగా ప్రేమిస్తారంటే.. కాలక్రమేణా ఒకరికొకరు పోట్లాడటం కూడా ప్రారంభిస్తారు.


అయితే వ్యక్తిగత జీవితంలో ఒకరికొకరు గొడవ పడే వీరిద్దరూ.. ప్రొఫెషనల్ జీవితంలో మాత్రం కలసికట్టుగా గుండాలను చితక కొడుతుంటారు. ఈ క్రమంలోనే తాము గాఢంగా ప్రేమించే సీనియర్ లేడీ పోలీస్ అధికారిణి చిరంజీవితో వివాహం చేసుకున్నారనే చేదు విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతారు. తీవ్ర నిరాశలో మునిగి తేలతారు. అయితే ఇలాంటి కథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.



విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. చిరంజీవి, నాగబాబు, బ్రహ్మానందం కూడా ఉండే ఓ సీన్ లో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ సన్నివేశంలో చిరంజీవి ఒక బొమ్మ చేత మాట్లాడిస్తుంటారు. అయితే వరుణ్ తేజ్ తనకి మాట్లాడే బొమ్మ కావాలని చిరంజీవిని అడుగుతారు. అప్పుడు చిరంజీవి ఇది మాట్లాడే బొమ్మ కాదని.. తానే మాట్లాడుతున్నానని చెబుతారు. కానీ తనకు బొమ్మ కావాలని వరుణ్ తేజ్ ఆ బొమ్మ తీసుకొని వెళ్ళి పోతారు. ఈ సన్నివేశం తో వరుణ్ తేజ్ గెస్ట్ అప్పియరెన్స్ స్క్రీన్ టైం పూర్తవుతుంది. ఈ చిత్రంలో వరుణ్.. వరుణ్ అనే పాత్రలోనే నటించారు. ఈ సన్నివేశం చూడాలనుకునేవారు.. యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉన్న ఫుల్ మూవీలో 2:01:36 ( 02 గంటల 1 నిమిషం 36 సెకన్ల) టైమ్ స్టాంప్ దగ్గర చెక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: