సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజకుమారుడు. మహేష్ డెబ్యూ మూవీగా రూపొందిన ఈ మూవీ లో ప్రీతీ జింతా హీరోయిన్ గా యాక్ట్ చేయగా మణిశర్మ సంగీతం అందించారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్బుతముగా దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి ఫస్ట్ మూవీ తోనే మహేష్ కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది.
అప్పట్లో చాలా కేంద్రల్లో అత్యద్భుతంగా కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా విజయవాడలోని అలంకార్ థియేటర్ లో 100 రోజులు అల్ షోస్ హౌస్ ఫుల్ కావడం విశేషం. మంచి ఫ్యామిలి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర చేయగా ఇతర పాత్రల్లో సుమలత, జయప్రకాశ్ రెడ్డి, ప్రసాద్ బాబు, శివాజీ రాజా నటించారు. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ ఒక స్పెషల్ రోల్ చేసారు. రైతులకు అండగా నిలబడి వారికోసం దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పేయే కృష్ణమూర్తి అనే రైతు పాత్రలో కృష్ణ అద్భుతంగా యాక్ట్ చేసారు.
ఇక రాజకుమారుడు మూవీ కోసం అప్పట్లో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని అనుకున్న దర్శకుడు రాఘవేంద్ర రావు చివరికి మణిశర్మకి ఛాన్స్ ఇవ్వడం, వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్న మణిశర్మ, ఆ మూవీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అదరగొట్టారు. అలానే ఈ మూవీలో సుమలత పాత్రలో మొదట మరొక సీనియర్ నటీమణిని తీసుకుందాం అని అనుకోవడం అయితే ఆ తరువాత సుమలతను ఖాయం చేయడం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తంగా సూపర్ స్టార్ కృష్ణ, తనయుడు మహేష్ ఫస్ట్ మూవీ రాజకుమారుడు లో స్పెషల్ రోల్ తో అదరగొట్టారు..... !!











మరింత సమాచారం తెలుసుకోండి: