అక్కినేని సమంత.. "ఏ మాయ చేసావే" సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , పెళ్లికి ముందు నేనే.. పెళ్లి తర్వాత నేనే..అంటూ స్టార్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న  విషయం అందరికి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ , ఆహా టీవీలో  పలు షోలను కూడా నిర్వహిస్తూ, రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాదు ఇటీవల వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేసిన విషయం తెలిసిందే. సమంత ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సినిమా ద్వారా మరింత గుర్తింపు వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమానే "ఓ బేబీ".


2019 జులై 5వ తేదీన తెలుగు భాష ఫ్యాన్సీ కామెడీ గా చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి బీ. వీ. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, డి.సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో సమంత , అలనాటి హీరోయిన్ లక్ష్మి ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం 2014 లో దక్షిణ కొరియా లో విడుదలైన ఈ చిత్రం ఆధారంగా రీమేక్ చేయబడింది. ఇక ఇందులో ప్రముఖ పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, ప్రగతి ,ఊర్వశి లు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఇక లక్ష్మి మనవడిగా సజ్జ తేజ కూడా నటించడం మరో విశేషం.చిన్న వయసులోనే ఒక అబ్బాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు కూడా జన్మనిస్తుంది. అతను ఆర్మీ కాల్పులు జరిపిన సమయంలో మరణించగా, ఏ తోడు లేక ఒంటరిగా తన బిడ్డతో ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని సాగించి, జీవితంలో అన్నీ కోల్పోయిన 70 సంవత్సరాల బామ్మ, శివుడు ఇచ్చిన వరంతో ఒక ఫోటో స్టూడియోలో తీసిన ఫోటో తో తన జీవితమే మారిపోతుంది. అలా 70 సంవత్సరాల బామ్మ తిరిగి 24 సంవత్సరాల వయసులో కి వచ్చి , తను కోల్పోయిన ఆనందాలు అన్ని తిరిగి ఎలా పొందింది.. అనేదే ఈ చిత్ర కథాంశం. ఇప్పటివరకు లేని ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి ,రెట్టింపు స్థాయిలో రూ.40 కోట్ల షేర్ ని వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక అంతే కాదు ఈ సినిమా సమంతా కెరియర్ నే మార్చేసిందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: