
అయితే షోకి యాంకరింగ్ చేస్తున్న నటుడు అలీ, సదా ను బిజీగా ఉన్న సదా, సడన్ స్లో అవడానికి గల కారణాలు ఏంటి ? అని అడుగగా తన మనసులోని బాధను చెప్పి ఎమోషనల్ అయ్యారు సదా. 2015 లో తన జీవితంలో పెను మార్పు చోటు చేసుకుందని, అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిచిన తన జీవితం ఒక్కసారిగా అంధకారంగా మారిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మా అమ్మకు నాలుకపై చిన్న కట్ ఉండగా టెస్ట్ చేయిస్తే అది కాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో నేను, నాన్న నిస్సహాయులుగా మారిపోయాం. మాది చాలా చిన్న సంతోషకరమైన ఫ్యామిలీ అమ్మ, నాన్నలకు నేను ఒక్కదాన్నే. అందుకుని వాళ్ళు నన్ను చాలా అపురూపంగా పెంచారు.
అమ్మతో నా బాండింగ్ మాటల్లో చెప్పలేనిది. అలాంటి అమ్మకు కాన్సర్ అని చెప్పడం, ఆ తర్వాత ఆమెకు భయంకరమైన ట్రీట్మెంట్ జరగడం ఇలా ఇవన్నీ చేరి నా మనసుని గాయపరిచాయి. మానసికంగా చాలా కుంగిపోయాను. అప్పటి వరకు నా మూవీ లైఫ్ పీక్స్ లో ఉంది. అయితే అమ్మకి కాన్సర్ అని తెలిసాక ఏ ఆఫర్ వచ్చినా వెంటనే నాట్ ఇంట్రెస్టడ్ అని చెప్పేసేదాన్ని. అవతలి వారు ఏంటి అది ఎంత పెద్ద ఆఫర్ ఇలా అవన్నీ అప్పుడు నా మనసులోకి వెళ్ళలేదు. అమ్మ బాధ ఒకటే నా మనసులో ఉంది. ఆ బాధతో అలా చాలా ఆఫర్లను రిజెక్ట్ చేశాను. అలా నా కెరియర్ కాస్త స్లో డౌన్ అయ్యిందని తెలిపారు సదా. ఇది కనుక జరగకపోయి ఉంటే సదా ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండేది.