మూవీ ఇండస్ట్రీలో ఎంతో మంది యాక్టర్స్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పలు కారణాల వలన సినిమాలకు దూరమై ఆఫర్లు వస్తున్నా వద్దనుకుని కెమెరాను దూరం పెట్టిన నటీనటులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు అందాల అప్సరస మన యూత్ ని షేక్ చేసిన హీరోయిన్ సదా. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన ఈమె అనూహ్యంగా ఒక పీరియడ్ లో సినిమాల్లో పెద్దగా కనిపించకుండాపోయారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ వచ్చారు. అయితే సినిమాలపై ఆమెకు ఇంట్రెస్ట్ తగ్గడానికి, ఒక్క సారిగా ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడంపై అప్పట్లో చాలా వార్తలే వినిపించాయి. అయితే ఇందుకు ఆమె జీవితంలో పెద్ద కారణమే ఉంది. అది స్వయంగా సదానే చెప్పారు. తాజాగా ఆలీతో సరదాగా షో కి విచ్చేసిన హీరోయిన్ సదా తన గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అయితే షోకి యాంకరింగ్ చేస్తున్న నటుడు అలీ, సదా ను బిజీగా ఉన్న సదా, సడన్ స్లో అవడానికి గల కారణాలు ఏంటి ?  అని అడుగగా తన మనసులోని బాధను చెప్పి ఎమోషనల్ అయ్యారు సదా. 2015 లో తన జీవితంలో పెను మార్పు చోటు చేసుకుందని, అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిచిన తన జీవితం ఒక్కసారిగా అంధకారంగా మారిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మా అమ్మకు నాలుకపై చిన్న కట్ ఉండగా టెస్ట్ చేయిస్తే  అది కాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో నేను, నాన్న నిస్సహాయులుగా మారిపోయాం. మాది చాలా చిన్న సంతోషకరమైన ఫ్యామిలీ అమ్మ, నాన్నలకు నేను ఒక్కదాన్నే. అందుకుని వాళ్ళు నన్ను చాలా అపురూపంగా పెంచారు.

అమ్మతో నా బాండింగ్ మాటల్లో చెప్పలేనిది. అలాంటి అమ్మకు కాన్సర్ అని చెప్పడం, ఆ తర్వాత ఆమెకు భయంకరమైన ట్రీట్మెంట్ జరగడం ఇలా ఇవన్నీ చేరి నా మనసుని గాయపరిచాయి. మానసికంగా చాలా కుంగిపోయాను. అప్పటి వరకు నా మూవీ లైఫ్ పీక్స్ లో ఉంది. అయితే అమ్మకి కాన్సర్ అని తెలిసాక ఏ ఆఫర్ వచ్చినా వెంటనే నాట్ ఇంట్రెస్టడ్ అని చెప్పేసేదాన్ని. అవతలి వారు ఏంటి అది ఎంత పెద్ద ఆఫర్ ఇలా అవన్నీ అప్పుడు నా మనసులోకి వెళ్ళలేదు. అమ్మ బాధ ఒకటే నా మనసులో ఉంది. ఆ బాధతో అలా చాలా ఆఫర్లను రిజెక్ట్ చేశాను. అలా నా కెరియర్ కాస్త స్లో డౌన్ అయ్యిందని తెలిపారు సదా. ఇది కను జరగకపోయి ఉంటే సదా ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: