ఒకప్పుడు హీరోయిన్లు సినిమాలను ఒప్పుకోవాలంటే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ మార్క్ ఉన్నవారితో ఆ కాలంలో సినిమా చేయడానికి  ఒప్పుకునేవారు. ఇక రాను రాను కాలం మారుతోంది. కథ  నచ్చితేనే సినిమాలను ఒప్పుకునే విధంగా మారిపోయారు హీరోయిన్లు.. ఇక ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అయితే.. కథ నచ్చి, తాము నటించే పాత్రకు మంచి పేరు వస్తుందా? రాదా?  అని సెలెక్ట్ చేసుకొని మరీ ఎంచుకుంటున్నారు.

ఇక అసలు విషయానికొస్తే, కొందరు హీరోయిన్లు కొన్ని సినిమాలలో సాహసాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. అలా నటించిన వారిలో హీరోయిన్ అనుష్క కూడా ఒకరు. ఈమె "సైజ్ జీరో" మూవీ కోసం భారీగా బరువు పెరిగింది."కోకిల చిత్రం" సినిమాలో నయనతార మూగ, చెవిటి పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రం కంటే ముందుగా చంద్రముఖి సినిమాలో నత్తిగా మాట్లాడి అందరిని మెప్పించింది.

ఇక ఈ మధ్య కాలంలో డీ గ్లామరస్ పాత్రలో మన హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే, ఇక జులాయి సినిమాలో ఇలియానా పళ్లకు బ్రేస్ వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలియానా మీద ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అలాంటి పని చేయడానికి మరో యువ హీరోయిన్ సిద్ధం అవుతోంది.
 

ఆమె ఎవరో కాదు వర్ష. ఈమె విజిల్ , జాను వంటి సినిమాలలో నటించింది.ఈ మధ్యనే"మిడిల్ క్లాస్ మెలోడీస్"సినిమా లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఈమె ప్రస్తుతం నటిస్తున్న సినిమా "స్టాండ్ అప్ రాహుల్" . ఈ సినిమాలో ఈమె కూడా ఇలియానా మాదిరే పళ్ళకు బ్రేస్ వేసుకొని కనిపిస్తుందట. ఇలాంటి పాత్రలో నటించడం వల్ల డీ గ్లామరస్ హీరోయిన్ గా పేరు పడుతుంది కదా అని ప్రశ్నించగా..

అందుకు.." నేను  నటిస్తున్న సినిమాలో ఆ పాత్రలో అలా కనిపించడం సినిమాకి ఎంతో అవసరమం.. కథ విన్నప్పుడు కూడా నాకు బాగా నచ్చడంతోనే ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నానని "  తెలిపింది. " నేను నటించే పాత్ర కి పేరు వస్తుంది అంటే.. ఎంత అందవిహీనంగా  ఉన్న పాత్రనైనా చేయడానికి ఇష్టపడతాను".. అని తెలిపింది వర్ష. అయితే ఇలాంటి పని ఇలియానా తర్వాత ఈమె చేస్తోందని వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి: